ఇస్రో కీలక ప్రకటన.. ‘విక్రమ్‌’ ల్యాండర్‌ లోకేషన్‌ గుర్తింపు

  • IndiaGlitz, [Sunday,September 08 2019]

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. చంద్రయాన్-2 విఫలం కావడంతో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో మౌనం రాజ్యమేలింది. ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే జాడలేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్‌ లొకేషన్‌ను ఇస్రో గుర్తించింది. అతి త్వరలోనే ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ మీడియా ముఖంగా కీలక ప్రకటన చేశారు. జాడలేకుండా పోయిన తర్వాత చంద్రయాన్-2 చంద్రుని ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండ్‌ అయినట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ల్యాండర్‌ థర్మల్‌ ఇమేజ్‌ను ఆర్బిటర్‌ క్లిక్‌ చేసినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్‌ మాత్రం అందలేదు. అయితే.. సంబంధాల పునరుద్ధరణ కోసం శాస్త్రవేత్తల విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ విక్రమ్ కు సంబంధించిన ఫొటోలు(థర్మల్ ఇమేజ్ లు) తీసిందని వెల్లడించారు. ల్యాండర్‌ను యాక్టివేట్ చేసేందుకు, సంకేతాలు పంపేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే ఇంతవరకూ విక్రమ్ నుంచి తమకు ప్రతిస్పందన రాలేదని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన విషయం విదితమే.

More News

అంతా వైసీపీ ఎమ్మెల్యే వల్లే...: హీరో నాని

ఇదేంటి.. వైసీపీ ఎమ్మెల్యేకు.. నేచురల్ స్టార్ నానికి ఏం సంబంధం..? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది నిజమే వైసీపీ ఎమ్మెల్యేతో నానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

హరీశ్‌కు కేటాయించబోయే శాఖ ఇదేనా!?

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, పార్టీకి అన్ని విధాలా అండగా.. కల్వకుంట్ల ఫ్యామిలీకి కట్టప్పగా ఉన్న సిద్ధిపేట ఎమ్మేల్యే హరీశ్ రావుకు కీలక పదవి దక్కనుందా..? హరీశ్‌ను మొదటిసారి

వెయిటేజ్ కోసం వెయిట్ పెరుగుతున్న హీరోయిన్‌

బ‌యోపిక్‌ల‌ను చూసే ప్రేక్ష‌కుడు పాత్ర‌ల‌కు క‌నెక్ట్ కావాలంటే ఆ పాత్ర‌లు రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉండాలి. అందు కోసం ఆయా పాత్ర‌ల్లో ఒదిగిపోవ‌డానికి న‌టీన‌టులు ప్ర‌య‌త్నించాలి.

నరసింహన్‌కు ఘన వీడ్కోలు.. కేసీఆర్‌పై ప్రశంసల వర్షం!

నేటితో తెలంగాణ గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే.

చీప్‌స్టార్‌పై ద‌ర్శ‌కుడి వివ‌ర‌ణ‌

ఆర్‌.ఎక్స్ 100తో హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఈయ‌న తన రెండో సినిమాను స్టార్ట్ చేయ‌డానికి మాత్రం చాలా స‌మ‌యాన్నే తీసుకుంటున్నారు.