ఇస్రో కీలక ప్రకటన.. ‘విక్రమ్’ ల్యాండర్ లోకేషన్ గుర్తింపు
Send us your feedback to audioarticles@vaarta.com
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. చంద్రయాన్-2 విఫలం కావడంతో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో మౌనం రాజ్యమేలింది. ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే జాడలేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ లొకేషన్‌ను ఇస్రో గుర్తించింది. అతి త్వరలోనే ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ శివన్ మీడియా ముఖంగా కీలక ప్రకటన చేశారు. జాడలేకుండా పోయిన తర్వాత చంద్రయాన్-2 చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయినట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ల్యాండర్ థర్మల్ ఇమేజ్ను ఆర్బిటర్ క్లిక్ చేసినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ మాత్రం అందలేదు. అయితే.. సంబంధాల పునరుద్ధరణ కోసం శాస్త్రవేత్తల విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ విక్రమ్ కు సంబంధించిన ఫొటోలు(థర్మల్ ఇమేజ్ లు) తీసిందని వెల్లడించారు. ల్యాండర్‌ను యాక్టివేట్ చేసేందుకు, సంకేతాలు పంపేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే ఇంతవరకూ విక్రమ్ నుంచి తమకు ప్రతిస్పందన రాలేదని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout