Chandramukhi 2:'చంద్రముఖి 2' నుంచి 'స్వాగతాంజలి' లిరికల్ సాంగ్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను అన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తోంది. సుభాస్కరన్ నిర్మాత. శుకవ్రారం ఈ సినిమా నుంచి ‘స్వాగతాంజలి...’ అనే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కంగనా రనౌత్ అభరణాలను ధరించి రాజనర్తకి చంద్రముఖిలా డాన్స్ చేయటాన్ని చూడొచ్చు.
ఇక సినిమా కోసం వేసిన సెట్స్, కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఇక ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యంలో పాట వినసొంపుగా ఉంది. శ్రీనిధి తిరుమల పాడిన ఈ పాటను చైతన్య ప్రసాద్ రాశారు. 2005లో పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. హారర్ జోనర్లో సరికొత్త సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన చంద్రముఖి చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్, ఆంథోని ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
‘చంద్రముఖి 2’ను వినాయక చవితికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు.
నటీనటులు: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వై.జి.మహేంద్రన్ రావు రమేష్, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు, టి.ఎం.కార్తీక్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com