కాన్ ట్రవర్సీ సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన బోస్
- IndiaGlitz, [Saturday,January 09 2016]
యంట్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో...ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం అందించగా...మూడు పాటలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. అయితే ఈ సినిమా కోసం చంద్రబోస్ డోంట్ స్టాప్ డోంట్ ప్టాప్ అనే పాట రాసారు.
ఈ పాటలో... వాళ్లు నిన్ను విసిరేసాం అని అనుకోని వాళ్ళకు తెలియదు నువ్వు ఒక బంతివి అని...వాళ్లు నిన్ను నరికేసాం అని అనుకోని...వాళ్లకు తెలియదు నువ్వు ఒక నీటి దారవని... వాళ్లు నిన్ను పాతేసాం అని అనేకోని వాళ్ళకు తెలియదు నువ్వు ఒక విత్తనం అని...విత్తనమై మొలకెత్తు..బంతిలాగా పైకి ఎగురు...వరదలాగ ఉప్పొంగు డోంట్ స్టాప్ డోంట్ స్టాప్...అని రాసారు. ఇది ఎన్టీఆర్ వ్యక్తగత జీవితాన్ని ద్రుష్టిలో పెట్టుకుని రాసారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయం గురించి గీత రచయిత చంద్రబోస్ ని అడిగితే...ఈ పాటలో కాన్ ట్రవర్సీ ఏమీ లేదు. అంతా కథలో భాగమే. సుక్కు ఫిలిమ్స్ లో ఒక్క విషయం కుడా సంబంధం లేకుండా ఉండదు అన్నారు. మరి...ఇది నిజమేనంటారా..?