బాలు సంగీత వర్సిటీ పెట్టాలంటూ జగన్‌కు చంద్రబాబు లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
లెజెండ్రీ సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన గొప్పతనాన్ని గుర్తించి భావితరాలకు స్ఫూర్తి కలిగించేలా తగు కార్యక్రమాలను చేపట్టాలని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌కు లేఖ రాశారు. అందులో బాలసుబ్రహ్మణ్యం పుట్టిన ప్రాంతమైన నెల్లూరులో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కళాక్షేత్రం పేరుతో మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. అందలో బాలుగారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించాలన్నారు చంద్రబాబు.సంగీత అకాడమీకి కూడా బాలు పేరు పెట్టాలని, యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి కళలలో స్టాండర్డ్స్ పెంచడానికి బాలుగారు ఎంతో చేశారని, కాబట్టి ఇలా చేయడం ఆయనకు సరైన నివాళి అని జగన్‌కు చంద్రబాబు లేఖలో సూచించారు. బాలసుబ్రహ్మణ్యం కోరిక ప్రకారం తెలుగు కవి తిక్కన కాంస్య విగ్రహాన్ని తయారు చేయించామని, ఆ విగ్రహాన్ని నెల్లూరులో ప్రతిష్టించాలని బాబు కోరారు. అంతే కాకుండా ప్రతి ఏటా రూ.10 లక్షలతో బాలు పేరు మీద జాతీయ పురస్కారాన్ని అందించాలని కూడా సూచించారు.
ఆగస్ట్ 5న మైల్డ్ కరోనా సింప్టమ్స్ అంటూ చెన్నై ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ అయ్యింది. అయితే మన డాక్టర్స్, విదేశీ డాక్టర్స్ వైద్య సహకారంతో ఆయన కోలుకుంటున్నారని మళ్లీ వార్తలు వినిపించాయి. బాలు తనయుడు ఎస్.పి.చరణ్ కూడా బాలు ఆరోగ్య పరిస్థితిపై వీడియోలు విడుదల చేస్తూ వచ్చారు. అయితే గురువారం బాలు ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్రిటికల్ కావడంతో డాక్టర్స్ ఆయన్ని బ్రతికించడానికి చర్యలు చేపట్టారు. కానీ పరిస్థితి చేయిదాటింది. శుక్రవారం బాలు కన్నమూశారు. ఆయన అంత్యక్రియలను పూర్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments