Chandrababu:చంద్రబాబును చెప్పుతో కొడతా.. టీడీపీ కార్యకర్త ఆగ్రహం..

  • IndiaGlitz, [Monday,December 18 2023]

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిపెట్టాయి. టికెట్ రాదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థుల అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర విజయవంతం చేయడం కోసం ఆనంద్‌బాబు అరకులో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో మావోయిస్టుల చేతిలో హతమైన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అబ్రహం అనుచరులు రెచ్చిపోయారు.

తమ నేత అబ్రహంకు టికెట్ ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని.. ఆయనకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సైలెంట్‌గా ఉండాలని అరకు పార్లమెంటరీ ఇంచార్జ్ కిడారి శ్రావణ్ వారించినా వినలేదు. ఈ క్రమంలోనే ఓ కార్యకర్త తమను మోసం చేసిన చంద్రబాబును చెప్పుతో కొడతానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సొంత పార్టీ నేతలనే చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారని.. దీంతో ఆ పార్టీ కార్యకర్తలే ఆయనపై తిరగబడుతున్నారంటూ వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు.

More News

Amardeep: అన్నపూర్ణ వద్ద ఘర్షణ .. అమర్‌పై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి, ఆ లేడి కంటెస్టెంట్ కారు అద్దాలు ధ్వంసం

15 వారాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్ 7 తెలుగు ముగిసింది. అందరిని షాక్‌కు గురిచేస్తూ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి, బిగ్‌బాస్ చరిత్రలో

Chandrababu-Lokesh:అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు లోకేశ్.. అక్కడే పాదయాత్ర ముగింపు..

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద యాత్రను ముగించనున్నారు.

Pawan Kalyan:పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ.. సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చ..

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి.

bigg boss 7 Telugu : బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ .. కాలర్ ఎగరేసిన రైతుబిడ్డ , కప్పుతో సగర్వంగా ఇంటికి

బిగ్‌బాస్ 7 తెలుగు విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సంపాదించిన ప్రశాంత్ విజేతగా నిలిచినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

CM Revanth Reddy:బీఆర్ఎస్ సభ్యులకు ఇదే నా శిక్ష: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదం చర్చలో కాంగ్రెస్-బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి.