లోపలేస్తారేమోనని చంద్రబాబుకు అనుమానొచ్చింది..!
Send us your feedback to audioarticles@vaarta.com
‘నా ప్రాణానికి ఏమైనా అయితే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు.. రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరు’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై కాస్త ఆలస్యంగానే ట్వి్ట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. తనపై ఉన్న అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లాలన్న భయం వేసినప్పుడల్లా.. చంద్రబాబుకు తన భద్రత గుర్తుకు వస్తుందని విజయసాయి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ప్లాన్ చేశారా ఏంటి..!?
"అవినీతి కేసుల్లో లోపల వేస్తరేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తొస్తుంది. తనను అరెస్ట్ చేస్తే చుట్టూ నిలబడి రక్షణ కల్పించాలని గతంలో ప్రజలను వేడుకున్నారు. తనకేదైనా అయితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరని ఇప్పుడు బెదిరిస్తున్నారు. దాడి నాటకానికి ప్లాన్ చేశారా ఏంటి?" అని ట్విట్టర్‌లో బాబును విజయసాయి ప్రశ్నించారు.
అందుకే ట్వీట్లతో నవ్వులు!
"లోకేశ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడు" అని లోకేష్‌పై విజయసాయి సెటైర్లేశారు.
చంద్రబాబుకు పరీక్షలు చేస్తే..!
"ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో గుర్తించిన ఫోభియాలను సైకాలజీ 5 కేటగిరీలుగా విభజించింది.చంద్రబాబు గారికి సైకియాట్రిక్ పరీక్షలు చేస్తే ఆరో కేటగిరి కూడా ఉందని తేలుతుంది.ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కడప, పులివెందులలాగా మారుస్తున్నారని పదేపదే తన అకారణ భీతిని(ఫోభియా) వ్యక్తం చేస్తుంటారాయన" అని విజయసాయి తన ట్వి్ట్టర్‌లో రాసుకొచ్చారు. విజయసాయి వ్యాఖ్యలకు నారా చంద్రబాబు, లోకేష్ ముఖ్యంగా బుద్దా వెంకన్న ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com