Chandrababu:ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు

  • IndiaGlitz, [Monday,December 11 2023]

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన చంద్రబాబును మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తోడ్కుని ఆయన గదికి తీసుకెళ్లారు. బాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. అనంతరం కేసీఆర్‌తో మాట్లాడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పరామర్శ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు జరిగిన తుంటి మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని డాక్టర్లు చెప్పారని.. ఆయన కోలుకునేందుకు ఆరు వారాల సమయం పడుతుందని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీబీఎన్ వెల్లడించారు.

ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌తో పాటు ప‌లువురు సీనియర్ నాయ‌కులు కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించారు. అలాగే సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మోత్కుపల్లి నరస్సింహులు, ఎంపీ మాలోత్ కవిత, మాజీ స్సీకర్ మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ త్వరగా కోలుకుని తప్పకుండా అసెంబ్లీకి రావాలని కోరినట్లు రేవంత్ చెప్పారు. అసెంబ్లీలో ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడాలని.. వారి సూచనలు, సలహాలు తమకు అవసరమని పేర్కొన్నారు. కాగా గత గురువారం అర్థరాత్రి కేసీఆర్.. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నివాసంలో కాలు జారి కింద పడ్డారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారు.

More News

Salaar:'సలార్-సీజ్ ఫైర్' రన్ టైమ్ ఫిక్స్.. ఎన్ని గంటలు అంటే..?

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా 'సలార్-సీజ్ ఫైర్.

Pawan Kalyan:నాదెండ్ల అరెస్ట్‌ను ఖండించిన పవన్ కల్యాణ్.. విశాఖ వస్తానని హెచ్చరిక..

విశాఖపట్టణంలో జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Lokesh:లోకేష్ పాదయాత్రలో మరో మైలురాయి.. పాల్గొన్న బాలయ్య కొడుకు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది.

Corona:దేశంలో మరోసారి కరోనా కలకలం.. కేంద్రం కీలక ప్రకటన..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మరి చేసిన ప్రాణవిలయం తలుచుకుంటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.

YCP MLA Alla:బ్రేకింగ్: వైసీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే ఆళ్ల రాజీనామా

ఎన్నికలకు ముందు వైసీపీకి భారీ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.