Chandrababu:ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు యూటర్న్.. నాడు పొగడ్తలు.. నేడు ఆరోపణలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ కూటమి కుట్రలు బయటపడ్డాయి. దీంతో టీడీపీ నేతలు, ఎల్లో మీడియా పిల్లిమొగ్గలు వేస్తోంది. ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్లు తాపత్రయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పచ్చ బ్యాచ్.. కొద్దిరోజుల క్రితమే అబ్బో ఇలాంటి చట్టం ఉంటే భూయజమానులు గుండెల మీద చేయి వేసుకుని ఉండొచ్చని పొగడ్తల వర్షం కురిపించారు. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు ఈ చట్టం చాలా ఉపయోగకరం అంటూ అప్పుడు చెప్పిన వారే.. ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం వామ్మో ఈ చట్టంతో మీ భూములను లాక్కొంటారని ప్రజలను భయపెడుతున్నారు.
ఎంతలా దిగజారిపోయారు అంటే చంద్రబాబుకు పనికొస్తుంది ఆంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి వెళ్లిపోయారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్...అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు... అలాంటి చట్టాలు ఉంటే ప్రజల భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆనాడు అసెంబ్లీలో సవివరంగా మాట్లాడారు. పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడం వల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు. ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేశారు.
ఇక చంద్రబాబు ఆప్తమిత్రుడు రామోజీరావు సైతం తన ఈటీవీ ఛానల్లో సైతం ఈ చట్టం గొప్పది అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేశారు. ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ పోటీపడి మరి ఈనాడులో కథనాలు ప్రచురిస్తున్నారు. చట్టాన్ని భూతంలా చూపిస్తూ ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు. అంటే చంద్రబాబుకు లాభం జరుగుతుంది అని భావిస్తే ఎలాంటి అసత్య కథనాలైనా ప్రచురించేందుకు వెనకాడరని ప్రజలకు అర్థమైంది.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ గతంలో ప్రసంగించారు. ఇప్పుడేమో ఆమె తన మరిది చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు. ఆంటే ఈ చట్టం మంచిది అని.. ప్రజలకు మేలు చేస్తుంది అని వీరికీ తెలుసు. అయినా కానీ తమ నాయకుడు చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడానికి నాలుక మడతేశారు. కానీ ప్రజలు అమాయకులేం కాదు కదా.. వాస్తవాలు తెలుసుకున్న ఓటర్లు వారంలో జరిగే ఎన్నికల్లో తమ ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com