ఈబీసీలకు 10% రిజర్వేషన్లపై చంద్రబాబు స్టాండ్ ఇదీ..
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్ని ఇప్పటికే కేబినెట్ ఆమోదించింది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో నడుస్తోంది. అయితే బిల్లు పాస్ అవుతుందా..? లేదా అన్నది ఇక్కడ అప్రస్తుతం. మోదీ సంచలన ప్రకటనపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి.. కొందరు అంగీకరించారు.. మరికొందరు తీవ్రంగా తప్పుపట్టారు.
తాజాగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కాపులకు రిజర్వేషన్లు ఇస్తేనే తాము ఈబీసీలకు రిజర్వేషన్లను సమర్థిస్తామని.. సపోర్టు చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పటికే వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని నివేదిక ఇచ్చామని.. దానిపై స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇదంతా ఒక స్టంట్‌గా లబ్ది పొందేందుకు మోదీ ప్రకటిస్తున్నారంటూ బాబు దుయ్యబట్టారు. మరోవైపు సీఎం కేసీఆర్ సైతం.. తెలంగాణలో వెనుకబడిన ముస్లీంలకు 12శాతం, ఎస్టీలకు 10శాతం ఇవ్వాలని మోదీకి మెలికపెట్టారు. రిజర్వేషన్లు పెంచాలని గట్టిగా పార్లమెంట్‌లో నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
మొత్తానికి చూస్తే ఇప్పటి వరకూ కాపుల నుంచి వస్తున్న విమర్శలు, వ్యతిరేకతకు గాను కేంద్రమే అమలు చేయట్లేదని చంద్రబాబుకు దగ్గర ఓ సమాధానం దొరికినట్లైంది. ఈబీసీలు- కాపులు రిజర్వేషన్లకు లింకు పెట్టిన చంద్రబాబు ఇక ఎన్నికల వరకూ ఇదే చెప్పుకోవచ్చు. మరోవైపు తెలంగాణలో సైతం ఎన్నోఏళ్లుగా ఉన్న ఎస్టీ, ముస్లీం రిజర్వేషన్లపై పెద్ద గందరగోళమే జరుగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల సీఎంలు పెట్టిన మెలికలతో మోదీ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com