ఈసీ చూపించిన వీడియోలతో కంగుతిన్న చంద్రబాబు!?

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు బూత్‌లలో ఎన్నికల సంఘం రీ- పోలింగ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీ పోలింగ్ వ్యవహారంపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు.. వైసీపీ చెప్పినట్లు ఈసీ గంగిరెద్దులాగా తలాడిస్తూ చేస్తోందని.. మేం కూడా 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఫిర్యాదు చేస్తున్నామని.. అక్కడ కూడా రీ పోలింగ్ జరిపితీరాలంతేనని టీడీపీ నేతలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చంద్రగిరిలో రీ పోలింగ్ వద్దని అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన విషయం విదితమే. అంతేకాదు.. చంద్రగిరిలో రీ పోలింగ్ ఆపాలని హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ సైతం దాఖలు చేశారు.

గంటపాటు అసలేం జరిగింది!

ఇవన్నీ అటుంచితే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్థాయి వ్యక్తి కూడా రీపోలింగ్‌పై ఢిల్లీకెళ్లి మరీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారంటే అసలు ఏపీలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. అయితే రీ పోలింగ్ వద్దన్న చంద్రబాబును సుమారు గంటకు పైగా అక్కడే కూర్చోబెట్టి ఏప్రిల్-11న ఆ ఐదు బూత్‌లలో ఏం జరిగింది..? అనే విషయాలను నిశితంగా వివరించి.. సీసీ ఫుటేజీ వీడియోలను చూపించారట. ఆ వీడియోలల్లో టీడీపీకి చెందిన కొందరు నేతలు రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఉండటం.. ఆయా బూత్‌‌లలో గొడవలు సృష్టించి మరీ టీడీపీకే ఓట్లేసుకున్నట్లు వీడియో స్పష్టంగా ఉండటంతో కంగుతిన్న చంద్రబాబు ఏం చెప్పాలో..? ఈసీకి ఏమని బదులివ్వాలో తోచక తిన్నగా వెనుతిరిగారట.

కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు ఇంకే ఏదేదో వారి అనుకూల మీడియాలో చెప్పించుకున్నారని వార్తలు వినవస్తున్నాయి. అయితే ఆఫీసు లోపల మాత్రం పైన చెప్పిన విధంగా జరిగిందట. ఈ వ్యవహారం లీకవ్వడంతో తెలుగు తమ్ముళ్లు, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి కంగుతిన్నారట. ఇదిలా ఉంటే.. శనివారం రోజు వైసీపీ బృందం సైతం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారితో భేటీ అయ్యి చంద్రగిరి వ్యవహారం మాట్లాడనున్నారు. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయబోతోందన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే.. చంద్రగిరి ప్రజలు చెవిరెడ్డికి పట్టం కట్టారా..? పులివర్తి నాని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపుతారా..? అనేది తేలాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

షియోమీ నుంచి సరికొత్త బైక్.. ధర 31వేలు మాత్రమే!

చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఫోన్లు మార్కెట్లోకి తెస్తూ..

జనసేన ఆఫీస్‌లో ఇఫ్తార్ విందు.. అలీ తమ్ముడు హాజరు!

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్క‌రించుకొని హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఘనంగా ఇఫ్తార్ విందునిర్వహించారు.

రవిప్రకాష్ గుట్టు రట్టు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

టీవీ9 రవిప్రకాష్ వివాదం గంటకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే నేషనల్ ట్రిబ్యునల్, హైకోర్టులో రవిప్రకాష్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.

సీనియర్ నటుడు ‘రాళ్లపల్లి’ కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు రాళ్ళపల్లి నరసింహారావు(73) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్లపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మ‌ళ్లీ 'ద‌డ‌' జోడీ.. 

నాగ‌చైత‌న్య‌కు ఇప్పుడు మంచి ఫేజ్ న‌డుస్తోంది. పెళ్ల‌య్యాక స‌తీమ‌ణి స‌మంత‌తో క‌లిసి చేసిన తొలి సినిమా 'మ‌జిలీ' ఆయ‌న‌కు సూప‌ర్ స‌క్సెస్ ఇచ్చింది. ఈ స‌మ్మ‌ర్‌లో బెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా బోణీకొట్టింది.