Sharmila:జగన్‌ పాలన కన్నా చంద్రబాబు పాలనే బెటర్.. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్..

  • IndiaGlitz, [Thursday,February 22 2024]

మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో సెకట్రేరియట్‌' కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) బయటకు రాకుండా విజయవాడలోని కాంగ్రెస్ పోలీసులు భారీగా చుట్టుముట్టారు. మరోవైపు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో పార్టీ అభిమానుల నినాదాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల తీరుతో ఆఫీసులోనే షర్మిల సహా ఇతర నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

23వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 23వేలు ఖాళీగా ఉన్నప్పుడు 7వేల ఉద్యోగాలే ఎందుకు వేస్తున్నారని అప్పుడు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మీరు 6వేల ఉద్యోగాలే ఎందుకు వేశారు. మరి మీ కంటే చంద్రబాబు నాయుడే మేలు కదా. మీ కంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ ఉద్యోగాలిచ్చారు. ఆయన కంటే ఘోరం అని మిమ్మల్ని మీరే నిరూపించారు. మాట తప్పం..మడమ తిప్పం అన్నవారు..ఇప్పుడు మాటను మడతపెట్టారు. రాజశేఖర్ రెడ్డి వారసత్వమంటే ఇదేనా? వైఎస్ జగన్ సమాధానం చెప్పాలి. మీరు సీఎం అయినప్పుడు 2 లక్షల 30వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి అందులో ఎన్ని భర్తీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. 30వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అని విమర్శించారు షర్మిల.

ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఏటా 500 మంది డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు చనిపోతున్నారు. బతుకు మీద ఆశలేకే.. వారంతా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలని విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఇక్కడ లేదా? ఇదేమైనా ఆఫ్ఘనిస్తానా? మీరేమైనా తాలిబాన్లా..? అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అలాగే 'వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్ట్ చేస్తున్నారు. 23 వేల పోస్టుల భర్తీ అని చెప్పి.. కేవలం 6 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం, అరెస్టులపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాదిగా వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు.? పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పార్టీ కార్యాలయంలోనే గడపాలా.? నాకు ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా.? మేము తీవ్ర వాదులమా.? సంఘ విద్రోహ శక్తులమా.? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారంటే మీరు భయపడుతున్నట్లే. మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నారు. ఎన్ని ఆటంకాలు కలిగించిన నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగదు'అని హెచ్చరించారు.

More News

Chandrababu: అలవికాని హామీలు ఎందుకు.. మాటిస్తే ఎన్టీఆర్‌లా నిలబడాలి.. చంద్రబాబుకు ప్రశ్నల వర్షం..

ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలు దూకుడు పెంచాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Pawan Kalyan:పవన్ కల్యాణ్‌ చేతికి రెండు ఉంగరాలు.. ఎందుకో తెలుసా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తూ నియోజకవర్గాల

Shanmukh Jaswanth: అరే ఏంట్రా ఇది.. గంజాయి సేవిస్తూ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అరెస్ట్..

వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా.. ఒకే దెబ్బకి రెండు పిట్టలా.. పోలీసులకు ఇద్దరు అన్నదమ్ములు భలే దొరికారు. ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

Tirumala:తిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. రమణదీక్షితులు సంచలన ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే వీడియో తెగ వైరల్ అవుతోంది.

టీవీ5 సాంబశివరావుపై భూకబ్జా ఆరోపణలు.. నెటిజన్లు తీవ్ర విమర్శలు..

టీవీ5 న్యూస్ యాంకర్ సాంబశివరావుకు సంబంధించిన ఓ వ్యవహారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న