పవన్ డిమాండ్స్ పై స్పందించిన చంద్రబాబు..!

  • IndiaGlitz, [Saturday,January 07 2017]

శ్రీకాకుళంలో జిల్లాలో కిడ్నీ వ్యాధి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌నీసం ఎందుకు ఇలా జ‌రుగుతుందో కార‌ణాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదు అంటూ జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌స్య పై ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించ‌క‌పోతే ఉద్య‌మ‌మే అంటూ ప్ర‌భుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు. ప‌వ‌న్ డిమాండ్స్ పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. ఇంత‌కీ చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే...
వైద్య‌రంగంలోని మేథావుల‌ను ప‌ట్టుకుని ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌కు కార‌ణాలు ఏమిటో తెలుసుకుంటాం. కిడ్నీ బాధితులు విశాఖ‌ప‌ట్నం నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే వాళ్ల‌కు ఉచిత బ‌స్ పాస్ లు ఇస్తాం. ఈ స‌మ‌స్య పై కేంద్ర‌ప్ర‌భుత్వం, హార్వ‌ర్డ్ ప‌రిశోధ‌నలు చేసినా పూర్తి నివేదిక ఇవ్వ‌లేక‌పోయాయి. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు మిన‌ర‌ల్ వాట‌ర్ అందించే ఏర్పాటు చేస్తున్నాం. సోంపేట‌, ప‌లాస‌ల్లో డ‌యాల‌సిస్ యూనిట్లు మంజూరు చేస్తున్నాం. అలాగే కిడ్నీ వ్యాథిగ్ర‌స్తులు ఉన్న ప్రాంతాల్లో సంచార వైద్యశాల‌ను ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఉద్దానం స‌మ‌స్య పై సి.ఎం చంద్ర‌బాబు నాయుడు స్పందించ‌డాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.