close
Choose your channels

Chandrababu:చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా

Monday, October 9, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాల వాదనలు జరిగాయి. జీఎస్టీ డీజీ రిపోర్ట్‌ను సీఐడీ కోర్టుకు అందించింది. చంద్రబాబు తరపున సాల్వే, సింఘ్వీ, సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ, పొన్నవోలు వాదించారు. స్కిల్ స్కాంపై 2021లోనే ఎఫ్‌ఐఆర్ నమోదైందని 2017కు ముందు కేసు నమోదైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని హరీష్ సాల్వే వాదించారు. సెప్టెంబర్ 19న కోర్టు తీర్పు రిజర్వ్ చేసిందని, సెప్టెంబర్ 20న కొన్ని డాక్యుమెంట్లను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిందని సుప్రీంకోర్టుకు సాల్వే తెలిపారు. ప్రతీకార చర్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నందు వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 17ఏ ప్రకారం ఓ ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు అధీకృత అధికారి అనుమతులు పొందాల్సిందేననని వాదించారు. దీనికి జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పందిస్తూ ఈ కేసులో మీ క్లయింట్‌కు 17ఏ వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిస్తున్నాయని తెలిపారు.

బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను కొట్టివేసిన ఏసీబీ కోర్టు..

అటు ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు ఊరట లభించలేదు. చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా చంద్రబాబు తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే చంద్రబాబును కస్టడీకి అప్పగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై గత కొన్ని రోజుల పాటు వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారానికి తీర్పును వాయిదా వేశారు. దీంతో ఇప్పుడు రెండు పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు.

ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు..

ఇటు ఏపీ హైకోర్టులోనూ చంద్రబాబుకు తీవ్ర నిరాశే ఎదురైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో ఆయన దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. అంగళ్లు కేసులో అరెస్ట్ అయిన వారికి ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు అయింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న హరిప్రసాద్‌, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణలకు బెయిల్ వచ్చింది. దీంతో చంద్రబాబుకు కూడా ముందస్తు బెయిల్ లభిస్తుందనే ఆశలో టీడీపీ నేతలు ఉన్నారు. అయితే చంద్రబాబుకు తప్ప మిగిలిన వారందరికీ బెయిల్ రావడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos