జగన్‌తో భేటీ ఎఫెక్ట్: ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఫోన్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, సీఎం చంద్రబాబు నార్నె శ్రీనివాసరావు.. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలున్నాయా..? లేదా అనేది పక్కనెడితే నందమూరి హీరో మామ సీఎం చంద్రబాబును కలవాల్సిందిపోయి జగన్‌ను కలవడమేంటి..? అంటూ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే జరిగింది. ముఖ్యంగా ఈ భేటీతో చంద్రబాబు, నందమూరి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పెద్ద రచ్చే జరిగిందట.
నార్నె శ్రీనివాసరావు 2014 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గారనే వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా పోటీ చేయాలని భావించిన ఆయన.. ఏపీలో ‘ఫ్యాన్’ గాలి వీస్తుండటంతో ఆ పార్టీలోకే వెళ్లాలని భావిస్తున్నారట. అందుకే ఇటీవల జగన్‌తో భేటీ అయ్యి తన మనసులోని మాటను బయటపెట్టగా.. గుంటూరు నుంచి నార్నెను బరిలోకి దింపుతానని జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చంద్రబాబు దాకా చేరుకుంది.
దీంతో నార్నె వైసీపీలోకి రాకను నిలువరించాలని అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు బాలయ్యకు చంద్రబాబు ఫోన్ చేసినట్లు సమాచారం. మన పార్టీలోకి వస్తే ఎవరొద్దంటున్నారు..? ఎందుకిలా చేస్తున్నారు..? టికెట్ ఇచ్చేందుకు సిద్ధమని ఆయన ఎక్కడ అడిగితే అక్కడ్నుంచే పోటీ చేయిస్తామని చెప్పారట. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలోకి వెళ్లకూడదు.. మీరే ఒప్పించాలని గట్టిగా ఇద్దరిపూ ఒత్తిడి తెచ్చారట బాబు.
అందుకే ప్రస్తుతానికి నార్నె చేరిక వాయిదా పడిందని.. లేకుంటే జగన్ లండన్ వెళ్లక మునుపే కండువా కప్పుకోవాల్సిందట. ఇప్పటికైతే ఆగారు సరే టికెట్ సంగతేంటి..? ఆయన్ను పార్టీలో చేర్చుకుంటారా..? అసలు నార్నె మనసులో ఏముంది ఆ టీడీపీ గట్టా.. లేకుంటే వైసీపీ గట్టా..? తేల్చుకోవాల్సిన టైమొచ్చిందన్న మాట. మరి ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు వైసీపీ అభిమానులు వేచి చూస్తున్నారు. సో.. ఈయన భవష్యత్తు కార్యాచరణేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout