Chandrababu:సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్లు మంగళవారానికి వాయిదా

  • IndiaGlitz, [Friday,October 13 2023]

సుప్రీంకోర్టులో టీడీపీ ఛీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. ఇవాళ న్యాయస్థానంలో ముందుగా క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగగా.. ఇవాళ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అధికార విధులు నిర్వర్తించడమంటే అవినీతికి పాల్పడటం కాదు కదా అని రోహత్గి వాదించారు. చట్ట సవరణ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కేసు పాతదే అంటారు.. అంతేనా? అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. చట్టసవరణ ముందు కేసు కాబట్టే 17ఏ వర్తించదని తన వాదన అని రోహత్గి చెప్పుకొచ్చారు. 2018 జులైలో చట్టసవరణ జరిగిందని.. 2014, 2015 కేసులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణించలేం అన్నారు. నిధుల విడుదలకు సంబంధించిన నిర్ణయానికి తనకు సంభందం లేదన్న చంద్రబాబు 17ఏ వర్తింపజేయాలని కోరడం పరస్పర విరుద్ధమని ముకుల్ పేర్కొన్నారు.

కేసులు మీద కేసులు పెట్టి సర్కస్ ఆడిస్తున్నారు..

అంతకుముందు చంద్రబాబు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. స్కిల్‌ కేసు విచారణకు ఫైబర్‌నెట్‌ కేసుతో సంబంధం ఉందని.. ఈ కేసులో చంద్రబాబును 16న కోర్టులో ప్రవేశపెట్టేందుకు వారెంట్‌ తీసుకున్నారని వాదించారు. కేసులపై కేసులు పెట్టి మమ్మల్ని సర్కస్‌ ఆడిస్తున్నారన్నారు. ఇక్కడ కూడా 17-ఏను ఛాలెంజ్‌ చేస్తున్నారా అని లూథ్రాను జస్టిస్ త్రివేది ప్రశ్నించగా. 17ఏ ప్రతిచోటా వర్తిస్తుందని లూథ్రా తెలిపారు. 17ఏ నిబంధన ఉన్నప్పుడు కేసుపెట్టే అధికారమే పోలీసులకు లేనప్పుడు కేసు ఎలా ఫైల్ చేస్తారని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. అనంతరం మంగళవారానికి విచారణను వాయిదా వేశారు.

సోమవారం అరెస్ట్ ఉండదని సీఐడీ తరపున హామీ..

అనంతరం ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ జరిగింది. కాగా, ఈ కేసులోనూ 17ఏ పరిగణలోకి తీసుకోలేదని చంద్రబాబు లాయర్ లూథ్రా వాదించారు. ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్, ఇద్దరికి రెగులర్ బెయిల్ వచ్చినప్పుడు తన క్లయింట్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇక పీటీ వారెంట్ ప్రకారం చంద్రబాబును ఏసీబీ కోర్టులో సోమవారం హాజరుపరచాల్సి ఉందని.. ఆరోజు హాజరుపరిస్తే చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే సోమవారం అరెస్ట్ ఉండదని లేదంటే ట్రయల్ కోర్టులో కేసు విచారణను బుధవారానికి వాయిదా వేయాలని కోరతామని రోహత్గీ తెలిపారు. దీంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

More News

SRK, Prabhas:ప్రభాస్‌తో పోటీకి వెనక్కి తగ్గిన షారుఖ్.. 'డంకీ' విడుదల తేదీ వాయిదా..!

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) ఈ ఏడాది రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చి మాంఛి ఊపు మీద ఉన్నాడు.

Ponnala Lakshmaiah:కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు.

Chandrababu:చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల పేరిట కొత్త డ్రామాకు తెరదీసిన టీడీపీ

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు డ్రామాలకు దిగారు.

Maruti Kiran:రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది.. టికెట్లు అమ్ముకుంటున్నారు: మారుతి కిరణ్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి ఎద్దేవా చేశారు.

BRS:జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్‌.. తెలంగాణ సెంటిమెట్‌ను మళ్లీ తెరపైకి తెస్తుందా..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా 2001లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీ ఏర్పడింది.