దెబ్బతీసేందుకే వైసీపీలోకి దగ్గుబాటి: చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు హితేశ్ ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. మంచి రోజు చూసుకుని జగన్ సమక్షంలో దగ్గుబాటి ఫ్యామిలీ చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన వైసీపీలో చేరడాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన వెళ్లే రూట్ సరైనదేని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సోమవారం ఎలక్షన్ మిషన్-2019పై జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు.
చంద్రబాబు మాటల్లోనే..
"అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరింది. దగ్గుబాటి మారని పార్టీలు లేవు. ఆర్ఎస్ఎస్ మొదలు అన్నిపార్టీల చుట్టూ దగ్గుబాటి ప్రదక్షిణలు చేశారు. కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి తర్వాత కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు దగ్గుబాటి మళ్లీ వైసీపీ గూటికి చేరారు. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కైంది" అని బాబు విమర్శలు గుప్పించారు.
దెబ్బతీసేందుకు కుట్ర..!
"అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారు. అవకాశవాదులంతా వైసీపీ గూటికి చేరారు. వాళ్లు అవకాశవాదంతో ఎన్టీఆర్‌కు అప్రతిష్ట తెస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్ బయోపిక్‌తో పాటు.. మళ్లీ ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయాలని కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లండి" అని ఈ సందర్భంగా టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కాగా.. ఇప్పటికే పలుమార్లు దగ్గుబాటి ఫ్యామిలీ వైసీలోకి వెళ్లకుండా చంద్రబాబు, లోకేశ్ మంతనాలు జరిపారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మొత్తానికి చూస్తే ఒకప్పుడు ఇద్దరూ అన్నదమ్ముల్లా ఉండి ఒకే పార్టీలో ఉండి పోరాడారు. అయితే ఇప్పుడు కొన్ని రాజకీయ పరిణామాల రీత్యా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు కలిసుండి.. ఇప్పుడు ‘ఢీ’ అంటే ‘ఢీ’ అంటున్నారు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో ఏ మేరకు సక్సెస్ అవుతారు..? వారిని అడ్డుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout