Kesineni Nani: పొమ్మనలేక పొగబెట్టారా..? కేశినేని నానికి చంద్రబాబు చెక్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అసలు స్వరూపం బయటపడుతోంది. ఇప్పటిదాకా పార్టీ మనుగడ కోసం నాటకాలు ఆడిన చంద్రబాబు అసలు విశ్వరూపం ఇప్పుడు బయపటపడింది. తనకు చెంచాగీరీ చేసే వ్యక్తులకు మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం నిజమైంది. తన మీద ఉన్న కేసుల్లో హస్తిన పెద్దలతో రాయబారం చేసే నేతలకే తన ప్రాధాన్యత అని స్పష్టంచేశారు. అలా చేయని వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారనే అంశం మరోసారి రుజువైంది. చీకటి వ్యవహారాలు చేయని కారణంగా పార్టీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తిని పార్టీ నుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. అది కూడా జగన్ ప్రభావం ఉన్న సమయంలో కూడా ఎంపీగా గెలిచిన కేశినేని నాని లాంటి వ్యక్తిని తీవ్రంగా అవమానించారు. ఇక్కడ ఉంటే మాత్రం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని.. లేదంటే వెళ్లిపోవచ్చని తెగేసి చెప్పారు.
సొంత తమ్ముడినే పురికొల్పి..
ఇందుకోసం ఆయన తోడబుట్టిన తమ్ముడినే అస్త్రంగా ఉపయోగించారు. ఈనెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభకు నాని బదులు ఆయన సోదరుడు చిన్నిని ఇంఛార్జిగా నియమించారు. అలాగే అక్కడి రాజకీయాల్లో తలదూర్చదని ఆదేశించారు. ఈ నేపథ్యంలో చిన్ని, నాని వర్గీయులు టీడీపీ కార్యాయలంలోనే పరస్పరం బాహబాహాకీ దిగారు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇది కాస్తా చినికిచినికి గాలివానలా మారింది. తమను అవమానించేందుకే సిట్టింగ్ ఎంపీ నాని ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ నాని వర్గం ఆందోళన చేసింది. ఒక దశలో దేవదాస్ మీద దాడికి యత్నించారు. దీంతో చిన్ని వర్గీయులు కూడా గట్టిగా ప్రతిఘటించారు
స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తా..
ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కేశినేని నానికి చంద్రబాబు చెక్ పెట్టారు. తిరువూరులో జరగబోయే సభలో జోక్యం చేసుకోవద్దని తన వ్యక్తుల ద్వారా స్పష్టంచేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా కరాఖండీగా వెల్లడించారు. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై నాని కూడా అంతే ఘాటుగా స్పందించారు. తాను ఎవరికీ గులాంగిరీ చేసేది లేదని పేర్కొంటూనే ఇండిపెండెంటుగా గెలవగలను అని ప్రతిజ్ఞ చేశారు.
పార్టీకి రాజీనామా చేస్తా..
గత కొన్నాళ్లుగా చంద్రబాబు చెంచాలు బోండా ఉమా, బుద్దా వెంకన్న లాంటి వాళ్లు నానిని విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో కేశినేనికి ఎట్టకేలకు పార్టీ తలుపులు మూసేశారు. ఈ సందర్భంగా నాని చంద్రబాబు గురించి కాస్త వెటకారపు వ్యాఖ్యలు చేశారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని అవి వస్తే ఇంకా పెద్ద స్థానంలో ఉండే వాడినంటూ చంద్రబాబుపై వ్యంగ్యంగా విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాని టీడీపీకి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని.. దానికి ఆమోదముద్ర పడగానే తెలుగుదేశం పార్టీకా రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు. మరి కేశినేని రాజకీయ భవిష్యత్ ఎలాంటి మలుపులు తిరుగనుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments