Chandrababu Naidu:టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మళ్లీ చుక్కెదురు
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. స్కిల్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను సోమవారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు..
చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. 17ఏ అంశం చుట్టూనే వాడివేడి వాదనలు జరగుతున్నాయి. ఈ కేసులో నోటీసులు జారీ చేయాలని రోహత్గీ వాదించగా.. సాల్వే ఈ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. అలాగే హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్ల అవసరం ఉండదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తెలిపారు. నోటీసులు కోర్టు విధానాల్లో భాగమని రోహత్గీ వాదించగా నోటీసులు అవసరం లేదన్న దానిపై ఆధారాలేమైనా ఉన్నాయా.? అని సాల్వేను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ గతంలో ఇచ్చిన తీర్పులను బెంచ్ ముందుంచుతానని సాల్వే పేర్కొ్‌న్నారు. స్కిల్ స్కాం కేసు మూలంలోనే దోషం ఉందని సాల్వే పేర్కొన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదని అందుకే దాన్నే సవాల్ చేస్తున్నట్లు వివరించారు.
ఈ కేసులో చంద్రబాబుపై రాజకీయ కక్ష లేదు..
స్కిల్ స్కాం కేసులో 2018 పీసీ చట్ట సవరణకు ముందే నేరం జరిగిందని సీఐడీ తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. చంద్రబాబుపై తగినన్న ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసులో చంద్రబాబు పేరును ఎప్పుడు చేర్చినా కేసు విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలని కోరారు. చట్ట సవరణకు ముందున్న నేరం కాబట్టే 17ఏ వర్తించదని స్పష్టంచేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష లేదని రోహత్గీ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments