విశాఖ ఎయిర్‌పోర్టులో నాడు జగన్.. నేడు బాబు నిర్బందం!
Send us your feedback to audioarticles@vaarta.com
2019 ఎన్నికలకు ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్టులో నిర్బందించిన విషయం తెలిసిందే. అయితే సేమ్ సీన్ జగన్ సీఎం అయ్యాక.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఎదురైంది. గురువారం నాడు ఉదయం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలో పర్యటించేందుకు చంద్రబాబు వెళ్లగా.. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద చంద్రబాబును అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌కు తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఆయన్ను నిర్బంధింలోనే ఉంచాలని పోలీసులు అనుకున్నారు. బాబుతో పాటు పలువురు టీడీపీ నేతలను, కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది.
90 నియోజకవర్గాల్లో నిరసనలు!
చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవటంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు. మొత్తం
90 నియోజకవర్గాల్లో రాస్తారోకోలు చేపట్టారు. పలు చోట్ల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు
పలు చోట్ల మహిళా కార్యకర్తలు కూడా నిరసనకు దిగారు.
వైసీపీ నేతల భూ కబ్జాలకు బలైవుతున్న పేదలకు చంద్రబాబు అండగా నిలబడేందుకు విశాఖ వెళ్తుంటే అరెస్ట్ చేస్తారా? అంటూ తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ పాక్షన్ సంసృతి, వైసీపీ రౌడీయిజం నశించాలంటూ నినాదాలు టీడీపీ నేతలు హోరెత్తించారు.
నన్ను ఎన్‌కౌంటర్ చేసినా పర్లేదు..!
ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా?.. పోలీసులు ఏం సమాధానం చెబుతారు? అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ ఎంత సమయమైనా.. విశాఖలో పర్యటన కొనసాగించి తీరుతానని అక్కడే తిష్టవేశారు. ఎయిర్‌పోర్టు ముందు వైసీపీ గూండాలు గుమికూడితే.. ఏమీ చేయలేక పోలీసులు చేతులెత్తేస్తారా?.. ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర కొనసాగిస్తానని కన్నెర్రజేశారు. అంతటితో ఆగని చంద్రబాబు.. ‘నన్ను ఎన్‌కౌంటర్ చేసినా వెనక్కి తగ్గను’ అని హెచ్చరించారు. వైసీపీ నేతలు డబ్బులిచ్చి మనుషుల్ని తీసుకొచ్చి.. మాపై కోడిగుడ్లు, చెప్పులు, రాళ్లు వేశారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌కు తరలింపు..!
ఇదిలా ఉంటే.. విశాఖ నుంచి హైదరాబాద్ ఫ్లైట్‌కి పోలీసులు స్వయంగా టికెట్ తీసి మరీ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అస్సలు అంగీకరించలేదు. అక్కడున్న నేతలందర్నీ బయటికి పంపించి.. చంద్రబాబుని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. భద్రత కోణంలోనే పర్యటన వాయిదా వేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments