రామానాయుడు సేవలు చిరస్మరణీయం : చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
జూన్-06న మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జయంతి. 85వ జయంతి కావడంతో ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నటీనటులు, దర్శకనిర్మాతలు లెజండరీ నిర్మాతను గుర్తు చేసుకున్నారు. ఈయన ఇండస్ట్రీకి చాలా మంది నటీనటులను పరిచయం చేశాడన్న విషయం విదితమే. వాణి శ్రీ, హరీష్, మాలాశ్రీ, ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్, టబు, ఆర్తి అగర్వాల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి రామానాయుడు లైఫ్ ఇచ్చారు. ఈయనకు సినీ ఇండస్ట్రీనే కాదు రాజకీయాల్లోనూ రాణించారు. ఇవాళ ఆయన జయంతి కావడంతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్మరించుకున్నారు. ట్విట్టర్ వేదికగా రామానాయుడు సేవలను చంద్రబాబు కొనియాడారు.
ఆయన సేవలను స్మరించుకుందాం..!
‘భారతదేశంలోని 13 భాషలలో అతి తక్కువ కాలంలో శతాధిక చిత్రాలను నిర్మించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన నిర్మాత స్వర్గీయ డా.రామానాయుడుగారు. మాజీ పార్లమెంటు సభ్యులుగా బాపట్ల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. తాను సినీరంగంలో సంపాదించిన డబ్బును తిరిగి ఆ రంగ అభివృద్ధికే ఖర్చుచేసి ఎంతో మందికి ఉపాధినిచ్చారు రామానాయుడుగారు. ఈరోజు పద్మ భూషణ్ రామానాయుడుగారి జయంతి సందర్భంగా సినీరాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout