Chandrababu: ఎన్నికల వేళ ప్రజల్లోనే ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సమీపిస్తుండటంతో ప్రజల్లోనే ఉండేలా టీడీపీ(TDP) ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పార్టీ అధినేత చంద్రబాబు(Chandra Babu), యువనేత లోకేష్(Lokesh)తో పాటు భువనేశ్వరి(Bhuvaneswari) కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే నిజం గెలవాలి పేరుతో మొదటి విడత యాత్ర చేసిన భువనేశ్వరి.. బుధవారం నుంచి రెండో దశ యాత్రకు శ్రీకారం చుట్టారు. వారానికి మూడు రోజులు పాటు ఆమె పర్యటిస్తారు. 3వ తేదీన విజయనగరం, 4వ తేదీన శ్రీకాకుళం, 5వ తేదీన విశాఖ జిల్లాలో చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శి్ంచనున్నారు. ఇక లోకేష్ కూడా నియోజకవర్గాల్లో పర్యటించేలా కసరత్తు చేస్తున్నారు.
ఇక జనవరి 4 నుంచి 'జయహో బీసీ' (Jayaho BC)కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వైసీపీ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ అరాచకాలపై బీసీల్లో చైతన్యం కలిగేలా 2 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగించనుంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో నేతలు పర్యటించేలా షెడ్యూల్ రూపొందించారు.
అటు పార్టీ అధినేత చంద్రబాబు 'రా.. కదలిరా' పేరుతో పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. జనవరి 5 నుంచి 29 వరకూ మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు సభలు జరగనున్నాయి. కొన్ని సభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా పాల్గొననున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు జిల్లాల షెడ్యూల్ ఇదే..
జనవరి 5 – కనిగిరి (ఒంగోలు పార్లమెంట్)
జనవరి 6 – తిరువూరు (విజయవాడ పార్లమెంట్), ఆచంట (నరసాపురం పార్లమెంట్)
జవవరి 9 – వెంకటగిరి (తిరుపతి పార్లమెంట్), ఆళ్లగడ్డ (నంద్యాల పార్లమెంట్)
జనవరి 10 – బొబ్బిలి (విజయనగరం పార్లమెంట్), తుని (కాకినాడ పార్లమెంట్)
జనవరి 18 – గుడివాడ (మచిలీపట్నం పార్లమెంట్)
జనవరి 19 – గంగాధర నెల్లూరు (చిత్తూరు పార్లమెంట్), కమలాపురం (కడప పార్లమెంట్)
జనవరి 20 – అరకు (అరకు పార్లమెంట్), మండపేట (అమలాపురం పార్లమెంట్)
జనవరి 24 – పీలేరు (రాజంపేట పార్లమెంట్ ), ఉరవకొండ (అనంతపురం పార్లమెంట్)
జనవరి 25 – కోవూరు (నెల్లూరు పార్లమెంట్), పత్తికొండ(కర్నూలు పార్లమెంట్)
జనవరి 27 – గోపాలపురం (రాజమండ్రి పార్లమెంట్), పొన్నూరు(గుంటూరు పార్లమెంట్)
జనవరి 28 – మాడుగుల (అనకాపల్లి పార్లమెంట్), టెక్కలి (శ్రీకాకుళం పార్లమెంట్)
జనవరి 29 – ఉంగుటూరు (ఏలూరు పార్లమెంట్), చీరాల(బాపట్ల పార్లమెంట్)
మొత్తానికి 100 రోజుల పాటు ప్రజల్లోనే ఉండేలా తెలుగుదేశం పార్టీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. కీలకమైన నేతలంతా జనాల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments