Chandrababu: ఎన్నికల వేళ ప్రజల్లోనే ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు

  • IndiaGlitz, [Tuesday,January 02 2024]

ఎన్నికల సమీపిస్తుండటంతో ప్రజల్లోనే ఉండేలా టీడీపీ(TDP) ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పార్టీ అధినేత చంద్రబాబు(Chandra Babu), యువనేత లోకేష్‌(Lokesh)తో పాటు భువనేశ్వరి(Bhuvaneswari) కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే నిజం గెలవాలి పేరుతో మొదటి విడత యాత్ర చేసిన భువనేశ్వరి.. బుధవారం నుంచి రెండో దశ యాత్రకు శ్రీకారం చుట్టారు. వారానికి మూడు రోజులు పాటు ఆమె పర్యటిస్తారు. 3వ తేదీన విజయనగరం, 4వ తేదీన శ్రీకాకుళం, 5వ తేదీన విశాఖ జిల్లాలో చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శి్ంచనున్నారు. ఇక లోకేష్ కూడా నియోజకవర్గాల్లో పర్యటించేలా కసరత్తు చేస్తున్నారు.

ఇక జనవరి 4 నుంచి 'జయహో బీసీ' (Jayaho BC)కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వైసీపీ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ అరాచకాలపై బీసీల్లో చైతన్యం కలిగేలా 2 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగించనుంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో నేతలు పర్యటించేలా షెడ్యూల్ రూపొందించారు.

అటు పార్టీ అధినేత చంద్రబాబు 'రా.. కదలిరా' పేరుతో పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. జనవరి 5 నుంచి 29 వ‌ర‌కూ మొత్తం 25 పార్లమెంట్‎ నియోజకవర్గాల్లో బ‌హిరంగ స‌భ‌లు నిర్వహించ‌నున్నారు. ప్రతి రోజూ రెండు స‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి. కొన్ని సభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా పాల్గొననున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు జిల్లాల షెడ్యూల్ ఇదే..

జ‌న‌వ‌రి 5 – క‌నిగిరి (ఒంగోలు పార్లమెంట్)
జ‌న‌వ‌రి 6 – తిరువూరు (విజ‌య‌వాడ పార్లమెంట్), ఆచంట‌ (న‌ర‌సాపురం పార్లమెంట్)
జ‌వ‌వ‌రి 9 – వెంక‌ట‌గిరి (తిరుప‌తి పార్లమెంట్), ఆళ్లగ‌డ్డ (నంద్యాల పార్లమెంట్)
జ‌న‌వ‌రి 10 – బొబ్బిలి (విజ‌య‌న‌గ‌రం పార్లమెంట్), తుని (కాకినాడ పార్లమెంట్)
జ‌న‌వ‌రి 18 – గుడివాడ‌ (మ‌చిలీప‌ట్నం పార్లమెంట్)
జ‌న‌వ‌రి 19 – గంగాధ‌ర నెల్లూరు (చిత్తూరు పార్లమెంట్), క‌మ‌లాపురం (క‌డ‌ప పార్లమెంట్)
జ‌న‌వ‌రి 20 – అర‌కు (అర‌కు పార్లమెంట్), మండ‌పేట‌ (అమ‌లాపురం పార్లమెంట్)
జ‌న‌వ‌రి 24 – పీలేరు (రాజంపేట పార్లమెంట్ ), ఉర‌వ‌కొండ‌ (అనంత‌పురం పార్లమెంట్)
జ‌న‌వ‌రి 25 – కోవూరు (నెల్లూరు పార్లమెంట్), ప‌త్తికొండ‌(క‌ర్నూలు పార్లమెంట్)
జ‌న‌వ‌రి 27 – గోపాల‌పురం (రాజ‌మండ్రి పార్లమెంట్), పొన్నూరు(గుంటూరు పార్లమెంట్)
జ‌న‌వ‌రి 28 – మాడుగుల‌ (అన‌కాప‌ల్లి పార్లమెంట్), టెక్కలి (శ్రీకాకుళం పార్లమెంట్)
జ‌న‌వ‌రి 29 – ఉంగుటూరు (ఏలూరు పార్లమెంట్), చీరాల‌(బాప‌ట్ల పార్లమెంట్)

మొత్తానికి 100 రోజుల పాటు ప్రజల్లోనే ఉండేలా తెలుగుదేశం పార్టీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. కీలకమైన నేతలంతా జనాల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించింది.

More News

Nadendla: వైసీపీ తీసుకొచ్చిన అనాలోచిత చట్టాలు రద్దు చేస్తాం: నాదెండ్ల

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనాలోచిత చట్టాలను టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు.

Daadi Veerabhadra Rao: ఎన్నికల వేళ వైసీపీకి బిగ్‌ షాక్.. దాడి వీరభద్రరావు రాజీనామా..

ఎన్నికల సమయంలో వైసీపీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. నాయకులు వరుసగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీని వీడగా..

అంగన్‌వాడీ వర్కర్లకు ప్రభుత్వం వార్నింగ్.. సమ్మె విరమించకపోతే..?

ఏపీలో కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్ల(Anganwadi Workers)కు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరుకావాలని..లేకుంటే శాఖాపరమైన చర్యలు

అయోధ్య రామ్ లల్లా విగ్రహం ఎంపిక ఖరారు.. ఎవరు చెక్కారంటే..?

అయోధ్య(Ayodhya) రామాలయంలో కొలువుదీరనున్న 'రామ్ లల్లా'(Ram Lalla) విగ్రహం ఎంపిక ఖరారైంది. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహాన్ని గర్భ గుడిలో

YSRCP: వైసీపీలో పెరుగుతున్న ధిక్కార స్వరాలు.. పార్టీకి మైనస్ కానున్నాయా..?

ఎమ్మెల్యేల మార్పు అంశం వైసీపీలో రోజురోజుకు తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. ఎప్పుడూ ఏ నేత పార్టీ మారతారో.. ఎవరూ పార్టీపై ధిక్కార వ్యాఖ్యలు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.