మురళీమోహన్ను పరామర్శించిన వెంకయ్య, చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
.
టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ వెన్నెముక ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆయన తన స్వగృహంలో విశ్రాంతి తీసుకున్నారు. మురళీమోహన్ను పరామర్శించడానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఇంటికెళ్లి పరామర్శించగా మరికొందరు ఫోన్లు చేసి పరామర్శించారు.
తాజాగా.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేశ్.. మురళీ మోహన్‌ను పరామర్శించారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని మురళీమోహన్ నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేర్ హాస్పిటల్ వైద్యులు సర్జరీ విషయంలో చాలా కేర్ తీసుకున్నారని మురళీమోహన్ వారికి వివరించారు. రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు. వైద్యులు సూచనలు పాటించాలని, పూర్తిగా నయమయ్యేవరకూ విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు, లోకేశ్ సూచించారు. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. మాజీ ఎంపీకి ఫోన్ చేసి పరామర్శించారు. అనంతరం ఇద్దరి మధ్య సుమారు 10 నిమిషాల పాటు ఫోన్ సంభాషణలో యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా.. ఈ నెలలో ఆపరేషన్ కుట్లు తీస్తారని.. త్వరలోనే అభిమానులు, నేతలు, అనుచరులు, కార్యకర్తలను కలుసుకుంటానని ఇటీవల ఓ వీడియోలో మురళీ మోహన్ స్పష్టం చేసిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout