శ్రీమంతుడుని అభినందించిన చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రం ఎంతటి సంచలనం స్రుష్టించిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ, రాజకీయ నాయకులు మహేష్ అభినందించారు. శ్రీమంతుడు చిత్రంలో హర్ష పాత్ర స్పూర్తితోనే మహేష్ ఆంధ్రప్రదేశ్ లో ఓ గ్రామాన్ని, తెలంగాణ లో ఓ గ్రామాన్ని దత్తతీ తీసుకున్నారు. తాజాగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీమంతుడు చిత్రాన్ని చూసారు.
శ్రీమంతుడు చిత్రం గురించి చంద్రబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ...మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగివ్వడమనే సందేశాన్ని చాలా చక్కగా చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ విలేజ్ ని ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉందన్నారు. చంద్రబాబు స్పందనకు....మీకు శ్రీమంతుడు నచ్చినందుకు థ్యాంక్స్ అంటూ తన సంతోషాన్ని మహేష్ ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com