చంద్రబాబుకు బెయిల్.. షరతులు ఏమిటంటే..?

  • IndiaGlitz, [Tuesday,October 31 2023]

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా నాలుగు వారాల పాటు అంటే నవంబర్ 28 వరకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు పలు షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.అయితే చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీలు ఉండాలన్న సీఐడీ అధికారుల అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి తెలిపారు.

బెయిల్ షరతులు ఇవే..

  • రూ.1 లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలి.
  • హైకోర్టు ఆదేశాలతో ఇవాళ సాయంత్రానికి జైలు నుంచి బయటకు రానున్న చంద్రబాబు రాజమండ్రి నుంచి భారీ ర్యాలీగా మధురపూడి విమానశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడకు వెళ్తారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించుకోనున్నారు.
  • ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.
  • కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు.
  • కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు.
  • ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.
  • చంద్రబాబుకు నచ్చిన ఆసుపత్రిలో సొంత ఖర్చులతో చికిత్స తీసుకోవచ్చు.
  • చికిత్స, ఆసుపత్రి వివరాలు జైలు అధికారికి సమర్పించాలి.
  • నవంబర్ 28 సాయంత్రం 5గంటల్లోపు జైలులో లొంగిపోవాలి.
  • ఇక చంద్రబాబుకు బెయిల్ లభించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష స్పందించారు. ‘యుద్ధం ఇప్పుడు ఆరంభం అయ్యింది’ అన్నారు. మరోవైపు పార్టీ అధినేతకు బెయిల్ లభించడంతో ఏపీతో పాటు తెలంగాణ టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.

More News

వైసీపీ ప్రభుత్వంపై జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు

వైసీపీ ప్రభుత్వంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న ఆరోగ్య

OTT:ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్‌లు ఇవే..

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సిద్ధమయ్యాయి.

Etala, Revanth:గజ్వేల్‌లో ఈటల.. కామారెడ్డిలో రేవంత్.. కేసీఆర్‌పై పోటీకి సై..!

ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతున్నారు.

Chiru, Maheshbbau:వెంకటేశ్ రెండో కుమార్తె నిశ్చితార్థం వేడుకలో చిరు, మహేశ్‌ సందడి

టాలీవుడ్‌ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు.

DK Aruna:కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. పార్టీ మార్పుపై తేల్చి చెప్పిన డీకే అరుణ..

తాను పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు.