చంద్రబాబుకు బెయిల్.. షరతులు ఏమిటంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా నాలుగు వారాల పాటు అంటే నవంబర్ 28 వరకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు పలు షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.అయితే చంద్రబాబుతో ఇద్దరు డీఎస్పీలు ఉండాలన్న సీఐడీ అధికారుల అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి తెలిపారు.
బెయిల్ షరతులు ఇవే..
- రూ.1 లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలి.
- హైకోర్టు ఆదేశాలతో ఇవాళ సాయంత్రానికి జైలు నుంచి బయటకు రానున్న చంద్రబాబు రాజమండ్రి నుంచి భారీ ర్యాలీగా మధురపూడి విమానశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడకు వెళ్తారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించుకోనున్నారు.
- ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.
- కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు.
- కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు.
- ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.
- చంద్రబాబుకు నచ్చిన ఆసుపత్రిలో సొంత ఖర్చులతో చికిత్స తీసుకోవచ్చు.
- చికిత్స, ఆసుపత్రి వివరాలు జైలు అధికారికి సమర్పించాలి.
- నవంబర్ 28 సాయంత్రం 5గంటల్లోపు జైలులో లొంగిపోవాలి.
- ఇక చంద్రబాబుకు బెయిల్ లభించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష స్పందించారు. ‘యుద్ధం ఇప్పుడు ఆరంభం అయ్యింది’ అన్నారు. మరోవైపు పార్టీ అధినేతకు బెయిల్ లభించడంతో ఏపీతో పాటు తెలంగాణ టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout