చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రమాదం తృటిలో తప్పిపోయింది. చంద్రబాబు కాన్వాయ్‌లో ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి ముందున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆవు అడ్డు రావడంతో దానిని తప్పించబోయి డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
చంద్రబాబు నాయుడు నేడు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఆయన కాన్వాయ్ చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్దకు రాగానే ఆవును తప్పించబోయి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనానికి ముందున్న జామర్ వాహనాన్ని ఎన్ఎస్‌జీ 2 వాహనం ఢీకొట్టింది. చంద్రబాబు క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
చంద్రబాబు భద్రతా సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఎన్ఎస్‌జీ వాహనం మొరాయించటంతో చంద్రబాబు 15 నిమిషాలపాటు రోడ్డుపైనే ఆగిపోయారు. ఘటన అనంతరం స్పేర్ వాహనంలో సిబ్బంది ఎక్కారు. అనంతరం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్‌కు వెళ్లిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com