రక్తం ఉడిపోతోంది.. 25 కుర్రాడిలానే.. : చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ పాలన చూస్తుంటే రక్తం ఉడికిపోతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ రాజమహేంద్రవరంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన.. నవ్యాంద్ర రాజధాని తరలింపుతో పాటు పలు విషయాలపై మాట్లాడారు.
‘‘ఏపీకి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా? రాజధానిగా ఉన్న అమరావతిని మార్చమని ఒక్క వ్యక్తి అయినా అడిగారా?. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నది ‘పేకాటలో మూడు ముక్కలాట’ కాదు. అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయని, అదే మన రాష్ట్రానికి రాజధాని ఏంటని అడిగితే ఏమని చెప్పాలి?. మన రాజధాని ఏదంటే అమరాతి పేరు చెప్పాలా? కర్నూలు పేరు చెప్పాలా? విశాఖ పేరు చెప్పాలా? లేక ‘పిచ్చి తుగ్లక్ పేరు చెప్పాలా?. మూడు రాజధానుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ‘అధికార వికేంద్రీకరణ’ అని చెబుతోందని, కావాల్సింది ‘అభివృద్ధి వికేంద్రీకరణ’ అని, ఏపీలో అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి’’ అని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
25 ఏళ్ల కుర్రాడిలానే..!
‘నేను పోరాటం చేస్తున్నది నా ఒక్కడి కోసం కాదు. ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాను. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం.. ఇలా అన్ని నగరాలు అభివృద్ధి కావాలి. బంగారు గుడ్డుపెట్టే బాతు మన అమరావతి. జగన్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి మూడు ముక్కల ఆట ఆడుతున్నారు. రాజధాని మార్పును విశాఖ ప్రజలు కోరుకోరు. అమరావతి ప్రజల పొట్టకొట్టి మా పొట్టలు నింపాలని విశాఖ ప్రజలు అనుకోరు. అమరావతి కోసం ఇంతమంది చనిపోతుంటే జాలి కలడం లేదా..?. ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరు ఉండరు. అమరావతి యుద్ధభూమిలా తయారైంది.. ఇదేమైనా పాకిస్తానా..? చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా ఖబడ్డార్. నా వయసు 60 కావొచ్చు.. కానీ 25 ఏళ్ల కుర్రాడిలానే ఆలోచిస్తాను’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments