Home »
Cinema News »
బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి చేయడం మనందరి అదృష్టం - చంద్రబాబు నాయుడు
బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి చేయడం మనందరి అదృష్టం - చంద్రబాబు నాయుడు
Monday, December 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియ నటించగా, తల్లిగా బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని నటించారు. కంచె ఫేమ్ చిరంతన్ భట్ సంగీతం అందించిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఆవిష్కరణోత్సవం తిరుపతిలో భారీగా తరలి వచ్చిన అభిమానుల
సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో బిగ్ సీడీను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
అనంతరం చంద్రబాబు ఆడియో సీడీలను వెంకయ్యనాయుడు, బాలకృష్ణ, హేమమాలిని, శ్రియ, క్రిష్ లకు అందచేసారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలినిని సత్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ... నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే బాలయ్య ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. 100వ సినిమాగా నార్మల్ సినిమా తీసిన బాగా ఆడుతుంది. అయినా మన చరిత్ర తెలియచేసే సినిమా అందించాలని ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఘన విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... బాలయ్య బంగారం. సంస్కారవంతమైన హీరోకు సంస్కారవంతమైన యూనిట్ దొరికింది. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం అద్భుతమైన విజయం సాధించాలి అన్నారు.
నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ... తెలుగువారి తేజాన్ని ఉత్తేజాన్నితెలియచేసే ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అయితే...చరిత్రలో మరుగునపడిపోయిన గౌతమీపుత్ర శాతకర్ణి కథను మనకు తెలియచేస్తున్నారు. తల్లి పేరు పెట్టుకుని అఖండ భారతాన్ని ఏలిన చక్రవర్తి శాతకర్ణి. డైరెక్టర్ క్రిష్, బాలయ్య కలిసి మనకు శాతకర్ణి చరిత్రను ఈ సినిమా ద్వారా చెబుతున్నారు. మన తెలుగు వారి చరిత్రను తెలియచేస్తున్నందుకు చిత్రయూనిట్ కు అభినందనలు. ఈ చిత్రం అద్భుత విజయం సాధించాలి అన్నారు.
మాటల రచయిత సాయి మాధవ్ మాట్లాడుతూ... గర్జించే సింహానికి మాటలు రాయడం అంటే మాటలా...? రగులుతున్న కాగడాకు మాటలు రాయడం అంటే మాటలా..? 43 ఏళ్లుగా నిర్వరామంగా అలరిస్తున్న హీరోకి మాటలు రాయడం అంటే మాటలా..? అయినా నేను రాసాను.
బాలకృష్ణ గారి సినిమాకి మాటలు రాయడం అనేది నా కల. ఇప్పుడు నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నాను అని చెప్పగానే...ఓ వైపు ఆనందం మరో వైపు ఆశ్చర్యం. ఎందుకంటే ఈ క్యారెక్టర్ బాలయ్య తప్ప వేరే ఎవరు చేయలేరు అంటే ఆయనే చేస్తున్నారు అన్నారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నేను ఈ సినిమాకి డైలాగ్స్ రాయాలి అన్నప్పుడు నా డైలాగ్స్ సార్ కి నచ్చుతాయా..? లేదా..? అని అనుమానం. బాలకృష్ణ గారి సినిమాలకి ఇప్పటి వరకు మహానుభావులు మాటలు రాసారు. మరి... నా మాటలు నచ్చుతాయా అనుకున్నాను. నాకు క్రిష్ గారు ఇస్తున్న ప్రతి అవకాశం ఒక జన్మ. ఇది నాకు ఇంకో జన్మ. ఈ సంస్థ అంటే నా మాతృ సంస్థ. ఈ సంస్థ లేకపోతే నేను లేను. జీవితాంతం రుణపడి ఉంటాను. బాలకృష్ణ, జాగర్లమూడి క్రిష్ కలిస్తే ఒక సింహం కూర్చొని పుస్తకం చదివితే ఎలా ఉంటుందో..అలా అంత అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. చిరంతన్ భట్ అద్భుతమైన పాటలు అందించారు. ఈ చిత్రంలోని పాటలు కాలర్ ట్యూన్ అవుతాయి. సిరివెన్నెల గారు అద్భుతమైన పాటలు రాసారు. ఆయన ఒక్కరు మాత్రమే ఈ పాటలు రాయగలరు అన్నారు.
డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ... ఏడు కొండలవాడి సన్నిథిలో నందమూరి అభిమానులు సమక్షంలో గౌతమీపుత్రశాతకర్ణి ఆడియో తిరుపతిలో జరగడం ఇదే సినిమాకి సగం బలం అని నా ఫీలింగ్. డిఫినెట్ గా ఈ సినిమా చాలా బాగుంటుంది. బాలయ్య ఫోన్ చేసి 100 ఆడియో ఫంక్షన్ కు రావాలి అని ఆహ్వానించినందుకు మనస్పూర్తిగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఎక్కడికి వెళ్లినా గౌతమీపుత్రశాతకర్ణి టీజర్ గురించే టాపిక్. ఈ టీజర్ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకుంటున్నారు. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న 100వ సినిమా 100 రోజులు ఆడుతుంది ఆల్ ది బెస్ట్ టీమ్ అన్నారు
డైరెక్టర్ బి.గోపాల్ మాట్లాడుతూ... ఈరోజు ఒక అద్భుతమైన రోజు. పెద్ద పండగ. మా బాలయ్య బాబు 100 సినిమాలు పూర్తి చేయడం సంతోషంగా ఉంది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి..ఇలా ఏ దేవుడి పాత్ర పోషించాలి అన్నా మనకు ఎన్టీఆర్ గుర్తుకువచ్చేవారు.
ఇప్పుడు వీరుడు గౌతమీపుత్ర శాతకర్ణి పాత్ర చేయాలి అంటే బాలయ్య బాబే చేయాలి. మా బాలయ్య బాబు అందమైన హీరో. డైనమిక్ హీరో. ఎక్కడికి వెళ్లినా టీజర్ అద్భుతంగా ఉంది అని చెబుతున్నారు. ఈ చిత్రం అద్భుతమైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయే సక్సెస్ ఫుల్ మూవీ కావాలి అని కోరుకుంటున్నాను. క్రిష్ కి మంచి పేరు రావాలి. హేమమాలిని ఈ ఫంక్షన్ లో ఉండడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ... ఎన్టీఆర్ తిరుపతికి తెలుగు గంగ నీళ్లు అందించారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసిన ఎన్టీఆర్ పుత్రుడు బాలయ్య 100వ సినిమా ఫంక్షన్ తిరుపతిలో చేయడం ఆనందంగా ఉంది. పౌరాణికం, జానపదం ఏదైనా చేయగల అలాంటి నటుడు లేరు రారు. బాలయ్య కుమారుడు కూడా త్వరలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అన్నారు.
తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ... ఈ సినిమా చరిత్ర సృష్టించాలి. తిరుపతిలో గౌతమీపుత్ర శాతకర్ణి వేడుక జరగడం గర్వకారణం. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల. ఈ సినిమాని ప్రొత్సహించాలి అని కోరుకుంటున్నాను అన్నారు
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ... భారతదేశాన్ని ఏకచక్రాధిపత్యంగా ఫాలించిన 5 వంశాలు తెలుగు వంశస్దులే. శాతవాహనులు భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పి మొత్తం ప్రపంచం చూపు మన వైపుకు తిప్పేలా చేసారు. మహా అద్భుతమైన చక్రవర్తి 25వ చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. మొదటసారి తల్లి పేరు ముందు పెట్టుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. భారతదేశం జనాన్ని
ఒక్కతాటి పై తీసుకువచ్చారు. ఇది ఒక అత్యంత అద్భుతమైన ప్రాజెక్ట్ . 2 సంవత్సరాల పాటు తీయాల్సిన ప్రాజెక్ట్ ఇది. మన కళ్ల ముందు ఇంత గొప్ప చిత్రాన్ని ఆవిష్కరించిన నిర్మాతలు రాజీవ్ రెడ్డి, శ్రీనివాస్, జాగర్లమూడి సాయిబాబుకు తెలుగు వారు కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎంతో రిస్క్ తీసుకుని ఈ సినిమా తీయడానికి సిద్దపడ్డారు. ఈ సినిమా అద్భుత విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను.
సాయిమాధవ్ అద్బుతమైన సంభాషణలు, క్రిష్ దర్శకత్వ ప్రతిభ, ధైర్యం, చిత్తరంజన్ భట్ సంగీతం, బాలయ్య అద్భుత నటనతో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది. రషెష్ చూస్తుంటే ఆశ్యర్యం కలిగింది. ఇంత తక్కువ టైమ్ లో ఎలా చేయగలిగారు అని. తెలుగువారు ఎన్నో చరిత్రలు సృష్టించారు. నిజంగా గౌతమీపుత్ర శాతకర్ణి వస్తే...నువ్వు కాదు గౌతమీపుత్ర శాతకర్ణి అంటే బాలయ్యలా ఉండాలి అంటారేమో అనిపించింది. తనకంటూ ఓ అధ్యాయాన్ని సృష్టించుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్యనాయుడు గారు. ఈ చిత్రంలో నటించిన ఒకప్పటి డ్రీమ్ గర్ల్ హేమమాలని అభినందిస్తున్నాను. పక్క రాష్ట్రాల వారు కంటే గొప్ప వాళ్లం అని చెప్పడం కాదు కానీ... వారికి అన్నలం చెబుతున్నాను. చాలా మందికి తెలియదు అనుకుంటున్నాను వాల్మీకి తెలుగువాడు. అగస్థ మహర్షి తెలుగువాడు. తెలుగు చరిత్ర అంటే భారతదేశం చరిత్ర అన్నారు.
బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని మాట్లాడుతూ... ఎన్టీఆర్ గారి పాండవవనవాసం చిత్రంలో నటించాను. ఇప్పుడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ వందవ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణకు తల్లి పాత్ర పోషించాను. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
శ్రియ మాట్లాడుతూ... ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన క్రిష్ కు థ్యాంక్స్. బాలయ్య గారితో వర్క్ చేయడం హ్యపీగా ఫీలవుతున్నాను. డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారితో వర్క్ చేయడంతో నా డ్రీమ్ నెరవేరింది. ఈ సందర్భంగా నా పేరెంట్స్ కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు చిరంతన్ భట్ మాట్లాడుతూ... బాలకృష్ణ గారి 100వ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నిర్మాతలు రాజీవ్ గార్కి, సాయిబాబు గార్కి డైరెక్టర్ క్రిష్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఈ సినిమాని మిస్ కాకండి తప్పకుండా చూడండి. నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన టీమ్ కు థ్యాంక్స్. శాస్త్రి గారు సాహిత్యం తెలుసుకునేందుకు త్వరలో తెలుగు నేర్చుకుంటాను అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ... బాలయ్య 40 ఏళ్లుగా అలసిపోకుండా సినిమాలు చేస్తున్నారు. చలిలో సైతం వేడి పుట్టించాలి అంటే బాలయ్య డైలాగ్ చెప్పాలి. ఆయన నటిస్తే రికార్డుల దాడే. ఈనెల 21కి లెజెండ్ 1000 రోజులు పూర్తి చేసుకుంది. సింహాలో చరిత్ర సృష్టించాలి అన్నా మేమే తిరగరాయాలి అన్నా మేమే అనే డైలాగ్ ఉంటుంది. లెజెండ్ సినిమాతో అది నిజమైంది. బాలయ్య అమరావతి ఖ్యాతి అందరికీ తెలియాలి అని ఈ సినిమా చేసారు. 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి 100 సెంటర్స్ లో వంద రోజులు ఆడాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.... ఉగాది అనేది ప్రారంభమైంది శాతకర్ణితోనే. ఈ విషయం చాలా మందికి తెలియదు.70, 80 శాతం మందికి తెలిసింది ఈ సినిమా ద్వారా అనుకుంటున్నాను. అందరూ గర్వపడే సినిమా తీసాను. అద్భుతమైన రూపం ఆవిష్కరితమైంది. చంద్రబాబు గారు లండన్ వెళ్లినప్పుడు అక్కడ మ్యూజియంలో అమరావతి శిధిలాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మనకు తెలియని మన సంస్కృతిని ఎక్కడో లండన్ వాడు పూజిస్తున్నాడు. కానీ..మనకు మాత్రం తెలియదు. సివిల్స్ ఎగ్జామ్స్ రాసేవారికి పాఠ్యాంశంలో చరిత్ర గురించి ఉంటుంది. చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే గౌతమీపుత్ర శాతకర్ణి గురించి 35 పేజీల సమాచారం దొరికింది. ఛత్రపతి శివాజీకి తన తల్లి శాతవాహన గురించి చెప్పేదట. ఎవరెవరో దగ్గర ఉన్న సమాచారం మన దగ్గర లేదు. శాతకర్ణి అంటే చూపు తీక్షణంగా ఉండాలి. నడుస్తుంటే కాగడ రగులుతున్నట్టు ఉండాలి. ఈ కథను బాలకృష్ణ ఒక్కడే దశదిశలా వ్యాపింప చేయగలడు అని చెప్పింది. బాలకృష్ణ గారు ఈ కథ విని ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ప్రణాళికతో వర్క్ చేసాం. ప్రతిదీ దైవ సంకల్పం. కెమెరామన్ జ్ఞానశేఖర్ వండర్ ఫుల్ విజువల్స్ అందించారు.గౌతమీపుత్ర శాతకర్ణి రోమన్ లో పుట్టి ఉండి ఉంటే ఇప్పటికే ఆయనపై చాలా సినిమాలు తీసేవారు ఆస్కార్ వచ్చేది అనిపించింది. తెలుగుజాతి గర్వపడే సినిమా తీసాను. ఈ కథను అంగీకరించి అవకాశం ఇచ్చిన బాలయ్య బాబు గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... నాకు సినిమా వాళ్లు అందరూ తెలుసు. కానీ సినిమాల గురించి పెద్దగా తెలియదు. సినిమాలకు కూడా మంత్రిని అయినందు వలన ఇక్కడకు రావడం ఒక బాధ్యత. ఇక రెండోది మన తెలుగు జాతి చరిత్రను తెలిసే విధంగా సినిమా తీయడం అద్భుతమైన విషయం. అందుకే ఈ వేడుకకు వచ్చాను. మన పూర్వీకుల చరిత్రను కాపాడుకోవాలి తెలుసుకోవాలి. సినిమాలు వినోదం కోసం తీస్తుంటారు కొంతమంది. విజ్ఞానం కోసం అరుదుగా తీస్తుంటారు. మన చరిత్రను గుర్తుచేసే సినిమా కావడంతో బాలయ్య ఈ సినిమా ఫంక్షన్ కి రావాలి అనగానే ఓకే అన్నాను. మడమతిప్పని మహానీయుడు ఎన్టీఆర్. ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నటుడుగానే కాకుండా విలక్షణమైన వ్యక్తిత్వంతో రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించిన వ్యక్తి ఎన్టీఆర్. జాతీయ రాజకీయాల్లో కూడా పేరు సాధించిన వ్యక్తి. భారతేదశానికి మొదటి తెలుగు చక్రవర్తి శాతవాహణ చక్రవర్తి. మంచి సినిమా తీసిన గౌతమీపుత్ర శాతకర్ణి టీమ్ అందర్నీ అభినందిస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆదరిస్తారని..మన సంప్రదాయాల్ని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ సినిమాలు చాలా రోజులు ఆడేవి. కానీ ఇప్పుడు అలా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లెజెండ్ సినిమా 1000 రోజులు ఆడింది అంటే ఆశ్యర్యం ఆనందం కలిగింది. బాలయ్య 100వ సినిమా 100 రోజులు ఆడాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.... తెలుగు హంస గౌతమీపుత్ర శాతకర్ణి. ఎక్కడో ఒక చల్లని సముద్ర గర్భంతో మనకంటూ ఒక భవిష్యత్ ను దేశాన్ని ఇచ్చి గుర్తింపునిచ్చి ఈ యావత్ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. కోటిలింగాలలో ట్రైలర్ విడుదల చేసాం. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నా అభిమానులు శ్రేయాభిలాషులు అందరూ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు. మనం అంతా గర్వంగా చెప్పుకునే ఆయన గురించి చాలా తక్కువ తెలుసు. క్రిష్ చేసిన చిత్రాలు తక్కువే అయినా గుర్తుండే సినిమాలు చేసాడు. 100వ సినిమా ఏం చేయాలి ఆలోచిస్తున్నప్పుడు ఆ టైమ్ లో ఈ కథ నా దగ్గరకు రావడం జరిగింది. తెలియని విషయం తెలియ చేయాలి అనే తపన ఉండడం వలన ఈ కథ చెప్పగానే నచ్చింది. ఈ కథ ఓకే అనగానే నిర్మాతలు ఎంతో ధైర్యంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశంలో తెలుగు రెండో స్ధానంలో ఉంది అని గర్వంగా చెప్పుకోవాలి. ఈ సినిమా చేయాలంటే అభిరుచి గల నిర్మాతలు కావాలి. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలకు అభినందనలు తెలియచేస్తున్నాను. చిరంతన్ భట్ కార్యక్రమానికి కథానాయకుడు.
సినిమా నేది వినోదం కోసమే కాదు విజ్ఞానం కోసం. నిద్రపోతున్నప్పుడు కనేది కల. నిద్రపోతున్న సమాజాన్ని నిద్రలేపేది కళ. చిరంతన్ భట్ మణిపూసలు లాంటి బాణాలు అందించారు. సాయిమాధవ్ గారు అద్భుతమైన సంభాషణలు రాసారు. దేశం మీసం తిప్పుదాం ఇలాంటివి డైలాగులు చాలా ఉన్నాయి. నేను అన్ని పాత్రలకు సరిపోను. ఆ పుణ్యదంపతుల బిడ్డగా పుట్టడం.. వాళ్ల దీవెనతో...అభిమానుల ఆశీస్సులతో నటసింహం అని పిలుపుంచుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే అవ్వడం అనేది కూడా తల్లిదండ్రులు ఆశీస్సులు అభిమానుల ఆశీస్సులు వల్లనే అని భావిస్తున్నాను. యుగానికి పర్వదినం కాబట్టి ఉగాది అని నామకరణం చేయడం జరిగింది. వర్షాలు పడుతున్నప్పుడు అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి కానీ మా షూటింగ్ మాత్రం ఆగిపోలేదు. నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని నూతనంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం కోసం చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. లెజెండ్ 1000 రోజులు పూర్తి చేసుకుంది. అమరావతి కోసంమని సినిమా తీద్దాం అనుకోలేదు అలా జరిగింది. బ్రహ్మాండంగా ఊహించి అద్భుతంగా కథను అల్లడం జరిగింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి అబ్బాయి శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో ఓ పాట చేసారు. నయనతార లేకపోతే శ్రీరామరాజ్యం లేదు. హేమమాలిని గారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు.ఎన్టీఆర్
అందరి గుండెల్లో నిండుగా ఉండి అందరికీ అండగా ఉన్నారు. ఆయని చేయని ఈ పాత్ర నేను చేయడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను. సమయం లేదు మిత్రమా.. సంక్రాంతికే 100వ పాత్రతో మీ ముందుకు వస్తున్నాను. నాకు అండగా ఉంటూ ముందుకు నడిపించిన అభిమానులే నాకు శ్రీరామరక్ష అన్నారు
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.... ఈ ఆడియో వేడుకలో అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ఈ సినిమా 100 రోజులు కాదు 1000 రోజులు ఆడుతుంది అనిపిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానమే అవసరం లేదు. బోయపాటి లెజెంట్ సినిమా 1000 రోజులు ఆడింది. దక్షిణ భారతంలో 1000 రోజులు ఆడిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా మన పూర్వ వైభవాన్ని తెలియచేసే సినిమా. బాలకృష్ణ గారు
100వ సినిమా ఏ సినిమా చేయాలి అని ఎదురు చూసారు. రాష్ట్రం విభజన జరగడం అమారావతి అని పేరు పెట్టడం జరిగింది. ఏ పేరు పెడితే బాగుంటుంది అని రాష్ట్రం మొత్తం ఆసక్తితో చూసారు. ఆ టైమ్ లో రామోజీరావు గారు రీసెర్చ్ చేసి అమరావతి అని పెడితే బాటుంటుంది అని ప్రతిపాదన పంపించారు. ఏకగ్రీవంగా ఈ పేరును అందరూ ఆమోదించారు. అంటే తెలుగు వారి చరిత్ర మళ్లీ అమరావతితో ముందుకు వచ్చింది.
క్రిష్ గారు చరిత్ర తెలియచేసేలా ఈ సినిమాని తీసినందుకు తెలుగు వారందరూ మనస్పూర్తిగా అభినందనలు తెలియచేయాలి. శాశ్వతంగా గుర్తుపుట్టుకునే రాజు గౌతమీపుత్రశాతకర్ణి. తల్లిపేరు ముందు పెట్టుకున్న రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. మహిళలకు గౌరవం ఇవ్వాలని చెప్పిన రాజు. 400 సంవత్సరాలు పరిపాలించారు శాతవాహనులు. తెలుగుజాతికి గర్వకారణం.
తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారకరామారావు. రాజకీయాల్లో కూడా పెను మార్పు తీసుకువచ్చిన వ్యక్తి. జాతీయస్ధాయిలో నిరంతరం పొరాడారు. ఏసుప్రభు పుట్టిన తర్వాత క్రీస్తు శకం ప్రారంభం అయ్యింది. ఆతర్వాత 70 సంవత్సరాల్లో శాలివాహన శకం ప్రారంభం అయ్యింది. బాలకృష్ణ 100వ సినిమాగా ఈ సినిమాని ఇది తీయడం అందరి అదృష్టం. చరిత్ర చెప్పడం పూర్వ జన్మసుకృతం ఇదొకచరిత్ర. ఈ సినిమా కంటే రాజధాని కట్టవలసిన బాధ్యత నాపై ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెం 1 గా ఉండాలి తప్పకుండా ఉంటుంది. ఆ సందర్భంగా ఈ సినిమా తీయడం బ్రహ్మాండంగా భావిస్తున్నాను. హేమమాలిని తల్లిగా నటించడం అరుదైన అవకాశం. కసిగా క్రిష్ ఈ సినిమా తీసాడు. నిర్మాతలు ఈ సినిమా ద్వారా లాభాల వస్తాయి మరో రెండు సినిమాలు చేసేంత లాభాలు వస్తాయి . సిరివెన్నెల బ్రహ్మాండమైన పాటలు, బుర్రా మాధవ్ అద్భుతమైన సంభాషణలు అందిచారు. చిత్తరంజన్ భట్ పాటలు బాగున్నాయి. తెలుగువారికి రెండు వరాలు 1పొలవరం 2 అమరావతి. ఈరెండు చేస్తే తెలుగువారికి తిరుగుండదు. ఎంతగానో సహకరిస్తున్న వెంయ్యనాయుడు గారిని అభినందిస్తున్నాను. ఈ సినిమా యూనిట్ అందరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. జై జన్మభూమి..జై గౌతమీపుత్ర శాతకర్ణి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
- logoutLogout
Login to post comment
-
Contact at support@indiaglitz.com