చంద్రబాబు శాశ్వతంగా పారిపోక తప్పదు : రోజా

  • IndiaGlitz, [Monday,July 29 2019]

పేదల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి అసెంబ్లీ ఇదేనని ప్రజలంతా మాట్లాడుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గత ఐదు సంవత్సరాలున్న ప్రభుత్వం అప్రాప్రియేషన్‌ బిల్లు పెట్టి పాస్‌ చేసుకొని వెళ్లడాన్ని చేశామని, కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అప్రాప్రియేషన్‌ బిల్లు చాలా విభిన్నమైందన్నారు. బిల్లు ద్వారా ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు చూసిన తరువాత బిల్లుకు మనస్సాక్షి ఉన్న ఎవరూ వ్యతిరేకించరని చెప్పారు.

గుండెలవిసేలా ఏడ్చారు!

2009 సెప్టెంబర్‌ 2వ తేదీన మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది కళ్ల ముందు నుంచి అదృశ్యమయ్యారని, దేశం గర్వించదగ్గ పథకాలు ప్రవేశపెట్టి తెలుగువాడి పాలన ఏ విధంగా ఉంటుందో చాటి చెప్పిన వైయస్‌ఆర్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో అకాలమరణం చెందారన్నారు. తాను ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి పేదవాడికి అందాయా.. లేదా అని స్వయంగా చూడాలని బయల్దేరిన వైయస్‌ఆర్‌ ప్రజలను అనాథలుగా వదిలి అనంతలోకాలకు వెళ్లారన్నారు. అన్నం పెట్టిన రాజన్న, అక్షరాలు దిద్దించిన రాజన్న ఇక లేరని తెలిసి ప్రజలంతా గుండెలవిసేలా ఏడ్చారుఅని గుర్తు చేశారు.

ప్రజల కోసం జగన్ పోరాటం!

ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాజకీయ రాబంధలు, ఢిల్లీ పెద్దలను, రాష్ట్రంలోని ఎల్లో గద్దలను ఎదరించి, అక్రమంగా జైలుకు పంపించినా, కుట్రలు చేసినా భరించి ప్రజా క్షేత్రంలో నిలబడి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజల కోసం పోరాడారు. ఆఖరికి వైఎస్‌ కుటుంబంలోని మహిళల చేత కూడా కన్నీరు పెట్టించినా.. ప్రజలకు ఇచ్చిన మాట కోసం, వైఎస్‌ఆర్‌ ఆశయ సాధన కోసం తడబడకుండా పది సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడిపోరాడిన ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోరాట ఫలితాలన్నీ బడ్జెట్‌ ద్వారా ప్రజలకు అందేలా చేస్తున్నారు. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ సృష్టించిన చరిత్ర చూస్తే ప్రజలు ఆయనపై పెట్టుకున్న విశ్వాసం తెలుస్తుంది. ఎంతో మంది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కొడుకులను చూశాము. కానీ వైఎస్సార్‌ కొడుకు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి లాంటి నాయకుడిని చూడలేదు.. చూడబోరు అని రోజా చెప్పుకొచ్చారు.

శాశ్వతంగా పారిపోతారు..!

మన రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కొడుకు 123 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని 23 సీట్లకు తీసుకువచ్చారని, సొంత కొడుకు లోకేష్‌ను కూడా గెలిపించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. అడ్డదారిలో వచ్చిన ఎమ్మెల్సీ పదవితో ఈ రోజు రాజకీయ పబ్బం గడుపుకుంటూ ట్విట్టర్‌లో ప్రభుత్వానికే ప్రశ్నలు వేస్తున్నాడు.. లోకేష్‌ అమాయకత్వం చూసి నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు. అప్రాప్రియేషన్‌ బిల్లుపై మాట్లాడలేక చంద్రబాబు శాసనసభ నుంచి పారిపోయారు. చంద్రబాబు పారిపోవడం ఇక్కడితో ఆగదని, సీఎం వైయస్‌ జగన్‌ చేపట్టిన పథకాలు చూసి శాశ్వతంగా రాజకీయాల్లోంచి పారిపోక తప్పదు. ఐదు సంవత్సరాలు తుఫాన్‌లు వచ్చినా.. రైతుల కరువును కూడా అవినీతిగా మార్చుకున్న అనకొండ చంద్రబాబు.. రెయిన్‌గన్‌లతో కోట్లాది రూపాయలు దోచుకున్నారు అని బాబుపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.