Chandrababu:అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ.. ఎన్డీఏలోకి ఆహ్వానం..

  • IndiaGlitz, [Thursday,February 08 2024]

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరూ పొత్తులో కలుస్తారో అర్థం కాని పరిస్థితి. నిన్నటివరకు పొత్తులకు దూరంగా ఒంటరిగా పోటీ చేయాలని భావించిన బీజేపీ ఇప్పుడు సడెన్‌గా గేర్ మార్చింది. పొత్తులు, సీట్లు గురించి చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఢిల్లీకి పిలిపించింది. బుధవారం రాత్రి 11.30 గంటల తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చంద్రబాబు సమావేశమై గంట పాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

పొత్తులో కలిస్తే తమకు 20 ఎమ్మెల్యే, ఆరు ఎంపీ స్థానాలు ఇవ్వాలని కమలం పెద్దలు చంద్రబాబును అడిగినట్లు సమాచారం. విశాఖ, అరకు, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, రాజంపేట ఎంపీ స్థానాలను అడుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే పార్టీ నేతలతో మాట్లాడి తన నిర్ణయం చెబుతానని చంద్రబాబు చెప్పినట్లు టాక్. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా వీరి మధ్య చర్చ జరిగిందంటున్నారు. ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా సాగుతున్నామని.. ఈసారి 400 ఎంపీ సీట్లను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అమిత్‌ షా.. చంద్రబాబుకు వివరించినట్లు కమలం నేతలు వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగా మీరు కూడా ఎన్డీఏలోకి రావాలని షా ఆహ్వానించారట.

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. అయినా కూడా హస్తిన వెళ్లి కేంద్ర పెద్దలతో గురువారం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సీట్ల పంపకాలపై స్పష్టత రానుంది. పవన్ భేటీ తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై అధికారికంగా ప్రకటన రానుంది. మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయో మరో రెండు రోజుల్లో తేలనుంది. మరోవైపు ఢిల్లీలో ఉన్న చంద్రబాబును వైసీపీ అంసతృప్తి నేతలు కలుస్తున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, నరసాపురం ఎంపీ రఘురామరాజు. తదితర నేతలు బాబును కలిశారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తారుమారాయి.

More News

Sharmila :తన చెడు కోరుకుంటున్నారా..? సీఎం జగన్‌ టార్గెట్‌గా షర్మిల విమర్శలు..

తన భద్రతపై సీఎం జగన్‌ టార్గె్‌ట్‌గా మరోసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

Lal Salaam:ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే.. రజినీకాంత్ డైలాగ్ అదిరింది..

మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లాల్ సలామ్'(LAL SALAAM) తెలుగు ట్రైలర్‌ మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

Family Star:రౌడీ హీరో 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసిందిగా.. వినేయండి..

రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. తనకు 'గీత గోవిందం' లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో

Modi:దేశాన్ని విభజించే కుట్రలను సహించేది లేదు.. ప్రధాని మోదీ ఫైర్..

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా

DSC Notification:నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఏపీ నిరుద్యోగులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) విడుదలైంది.