బాలయ్యకు బావ, అల్లుడు బర్త్ డే విషెస్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అ్రగనటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా బాలయ్య బావ, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. అల్లుడు నారా లోకేష్ విషెస్ చేశారు.
చంద్రబాబు ట్వీట్ ఇదీ..
‘నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నూటికి నూరుపాళ్ళు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణగారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణగారు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు’ అని నారా చంద్రబాబు విషెస్ తెలిపారు.
నారా లోకేష్ ట్వీట్..
'అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు, షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు. నిన్న బాలా మావయ్య కొత్త సినిమా టీజర్ చూశాను. చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. మావయ్యా... మీరు మరెన్నో చిత్రాల్లో నటించి... మీ అభిమానులకు ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను’' అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నూటికి నూరుపాళ్ళు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణగారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణగారు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు#HappyBirthdayNBK pic.twitter.com/MoxySlQB6s
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 10, 2020
అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు(1/2)#HappyBirthdayNBK pic.twitter.com/Mh7CLDo3sT
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 10, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com