ప్రమాణానికి ముందు జగన్‌కు చంద్రబాబు లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరిగాంధీ స్టేడియం వేదికగా.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ మహోత్సవానికి కొద్ది సేపటి ముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
లేఖలో ఏముంది..
"ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మీకు అభినందనలు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తాము.
ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని లేఖలో చంద్రబాబు వివరించారు. కాగా వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి రాకపోగా టీడీపీ తరఫున ఇద్దరు లేదా ముగ్గురితో కూడిన బృందం జగన్ ఇంటికి వెల్లి నేరుగా విషెస్ చెప్పినట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments