ప్రమాణానికి ముందు జగన్‌కు చంద్రబాబు లేఖ

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరిగాంధీ స్టేడియం వేదికగా.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ మహోత్సవానికి కొద్ది సేపటి ముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

లేఖలో ఏముంది..

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మీకు అభినందనలు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తాము.

ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని లేఖలో చంద్రబాబు వివరించారు. కాగా వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి రాకపోగా టీడీపీ తరఫున ఇద్దరు లేదా ముగ్గురితో కూడిన బృందం జగన్‌ ఇంటికి వెల్లి నేరుగా విషెస్ చెప్పినట్లు సమాచారం.

More News

కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన 42 మంది నేతలు వీరే..

భారతీయ జనతాపార్టీ ఎవరు సపోర్టు లేకుండా స్వతంత్రంగా పోటీచేసి ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం మోదీ మానియా.. షా చరిష్మా మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జగన్, కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు నో పర్మిషన్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది.

భావోద్వేగంతో ప్రసంగం.. పెన్షన్‌పై జగన్ తొలి సంతకం.. మీడియాకు వార్నింగ్!

అవినీతి రహిత పాలన అందించేందుకు పాలనలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తానని.. ప్రజలందరి ముఖాల్లో సంతోషం నింపడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

అజయ్ 'స్పెషల్' జూన్ 14న రిలీజ్

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో

హృదయాలను ఏలే ‘దొరసాని’

రియలిస్టిక్ అండ్ ఇంటెన్సిటీ ఉన్న కథలకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. అలాంటి ఓ రియలిస్టిక్ స్టోరీతో వస్తోన్న చిత్రమే ‘దొరసాని’.