ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం: చంద్రబాబు

  • IndiaGlitz, [Saturday,April 13 2019]

ఏపీలో ఎన్నికల నిర్వహణ లో ఈసీ తీరును అన్ని పార్టీ దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో సీఈసీ సునీల్ అరోడతో సమావేశం అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన... ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం అయిందన్నారు. ఇష్టారీతిన వ్యవహరించి రాష్ట్రాన్ని రావణ కాష్టం లా మార్చిందని మండిపడ్డారు.

పోలింగ్ సమయంలో ఏపీలో ఇంతటి అరాచకాలను ఇంతకీ ముందెప్పుడూ నేను చూడలేదు అన్నారు. దీనికి ఈసీ బాధ్యత వహి స్తుందా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రజల ప్రాథమిక హక్కులను భంగం వాటిల్లే లా వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు. మోడీ ఆదేశాల మేరకు ఈసీ ఏకపక్షంగా వ్యవహరించింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కూడా తుంగలో తొక్కింది అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సిఎస్ ను బదిలీ చేసి... అవినీతి ఆరోపణలున్న ఐఏఎస్ ను సిఎస్ గ నియమించడం ఏంటి అని... తెల్లవారు జాము వరకు పోలింగ్ జరిగింది అంటే... ప్రజాస్వామ్యం ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు. ఈవిఎం ల మొరాయింపు విషయం లో వైసీపీ ఒక్క మాట మాట్లాడక పోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ప్రజలకు అర్దం అవుతుంది అన్నారు.