Chandrababu:చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల పేరిట కొత్త డ్రామాకు తెరదీసిన టీడీపీ

  • IndiaGlitz, [Friday,October 13 2023]

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు డ్రామాలకు దిగారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు.. గురువారం నుంచే చంద్రబాబు కుటుంబసభ్యులు గేమ్‌ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే స్కిన్ ఎలర్జీకి ఉందని చంద్రబాబు చెప్పడంతో వెంటనే జైలు అధికారులు స్పెషలిస్ట్ వైద్యులను పిలిపించి వైద్యం చేయించారు. అనంతరం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని హెల్త్ బులిటెన్ కూడా విడుదలు చేశారు.

చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తప్పుడు ప్రచారం..

అయినా కానీ టీడీపీ నేతలు, బాబు కుటుంబసభ్యులు మరో డ్రామాకు తెరదీశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని.. ఐదు కేజీల బరువు తగ్గారనే ప్రచారానికి దిగారు. దీంతో చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎండలు ఉంటే జైలైనా, ఇంట్లో అయినా ఉక్కపోత ఒక్కటే కదా..? అలాంటి వాతావరణం ఆధారం బెయిల్ ఇస్తే.. దేశంలో ఎంతమంది ఖైదీలకు ఇవ్వాలి. చట్టం ఒక్కొక్కరికీ, ఒక్కోరీతిలో ఉంటుందా? చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారా.? లేదా.? అని చెప్పేది వైద్య నిపుణులా? టీడీపీ నాయకులా? తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని నారా భువనేశ్వరి ఎలా చెబుతారు?

చట్టం నుంచి తప్పించుకోవడానికే కదా? ఈ ఎత్తుగడలు..

మొన్ననే నా భర్త ఆరోగ్యం ఉన్నారని.? ధైర్యంగా పోరాడమన్నారని చెప్పారు కదా. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు కదా? దేశంలో కోట్లాది మందికి అదే పద్ధతిలో తాగునీరు సరఫరా అవుతుంది కదా? రాజమండ్రి జైలులో కూడా ఆ పద్ధతిలోనే తాగునీరు సరఫరా అయితే అనారోగ్యం వచ్చేస్తుందా? ఒకేసారి ఈ ఎత్తుగడలు ఎందుకు? తప్పుడు ప్రచారాలు ఎందుకు? చట్టం నుంచి తప్పించుకోవడానికే కదా? తప్పు చేసిన ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని గుర్తు పెట్టుకోవాలి.

బాబు ఆరోగ్యంపై బయటపడ్డ టీడీపీ దొంగ నాటకం..

బాబు బరువు తగ్గారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66కేజీలు ఉన్నారని.. ఇప్పుడు కేజీ బరువు పెరిఇ 67 కేజీలకు చేరుకున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. చంద్రబాబును ఆసుపత్రికి తరలిస్తున్నట్టు ఆసుపత్రి బెడ్‌పై చంద్రబాబు ఉన్నట్టు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయని..అదంతా అవాస్తవం అన్నారు. చర్మవ్యాధి నిపుణులు చంద్రబాబును పరీక్షించి కొన్ని మందులు ఇచ్చారని ఆయన వెల్లడించారు. జైళ్లలో ఏసీలు ఏర్పాటు చేసేందుకు నిబంధనలు అంగీకరించవని తనకు తెలిసి దేశంలోని ఏ జైలులోనూ ఏసీలు ఉండవని డీఐజీ క్లారిటీ ఇచ్చారు.

More News

Maruti Kiran:రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది.. టికెట్లు అమ్ముకుంటున్నారు: మారుతి కిరణ్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి ఎద్దేవా చేశారు.

BRS:జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్‌.. తెలంగాణ సెంటిమెట్‌ను మళ్లీ తెరపైకి తెస్తుందా..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమ పార్టీగా 2001లో కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీ ఏర్పడింది.

Maruti Kiran:సామాన్య కార్యకర్త నుంచి పీఎం స్థాయికి ఎదిగే పార్టీ బీజేపీ మాత్రమే: మారుతి కిరణ్

బీజేపీ అనేది పార్టీ కాదు కుటుంబం అని బీజేపీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి తెలిపారు.

Lokesh:చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది.. ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు: లోకేశ్

నెల రోజులుకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Bandla Ganesh:పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి.. ఆయనపై సీఎం జగన్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: బండ్ల గణేష్

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawankalyan) పెళ్లిళ్లపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(JaganMohan Reddy) చేసిన వ్యక్తిగత విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి