త్వరలో ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త!
Send us your feedback to audioarticles@vaarta.com
అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నడూ చేయని.. పట్టించుకోని పనులను సైతం ఎన్నికల ముందు అది చేశాం.. ఇది చేశామని జనాలను తమవైపు తిప్పుకునేందుకు బాబు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి.. జామురాత్రి వరకు సమావేశాలు నిర్వహిస్తూ అసలు ఎన్నికలకు వెళ్లాలి..? ఏయే హామీ ఇవ్వాలి..? రెండోసారి సీఎం సీటును ఎవర్ని వరించబోతోంది..? ఏయే కొత్తపథకాలతో మనం మళ్లీ నెగ్గొచ్చని.. అసలు మన మైనస్ పాయింట్స్ ఏవి..? అనే విషయాలపై నిశితంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. జనవరి 31న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
భూధార్ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం
రాజధాని అభివృద్ధికి రూ.55,343 కోట్లతో సమగ్ర ఆర్ధిక ప్రణాళిక
అమరావతిలో 7 సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ కేబినెట్ ఆమోదం
గుంటూరులో టెక్స్‌టైల్ పార్క్‌కు భూములు కేటాయింపు
కర్నూలు ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసుకు స్థలం కేటాయింపు
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయం
పసుపు-కుంకుమ పథకానికి కేబినెట్ ఆమోదముద్ర
అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపుపై కేబినెట్ కీలక నిర్ణయం
హైకోర్టులో రూ. 250 కోట్లు డిపాజిట్ చేసి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని నిర్ణయం
ఆస్తుల వేలం తర్వాత కోర్టు నుంచి నగదు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం
ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న ప్రభుత్వం
చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం
ప్రత్యేకహోదా, వంశధార నిర్వాసితులపై కేసులు ఎత్తివేత
సమైక్యాంధ్ర ఉద్యమంలో కేసులు ఎత్తివేతకూ కేబినెట్ ఆమోదం
బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని కేబినెట్ నిర్ణయం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లును..
అడాప్ట్ చేసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
10 శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కాపులకు కేటాయించాలని నిర్ణయం
అసెంబ్లీలో బిల్లు పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మొత్తానికి చూస్తే త్వరలో ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవన్నీ ఎంత వరకు వర్కవుట్ అయితాయనే విషయాలు తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout