త్వరలో ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త!

  • IndiaGlitz, [Friday,February 01 2019]

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నడూ చేయని.. పట్టించుకోని పనులను సైతం ఎన్నికల ముందు అది చేశాం.. ఇది చేశామని జనాలను తమవైపు తిప్పుకునేందుకు బాబు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి.. జామురాత్రి వరకు సమావేశాలు నిర్వహిస్తూ అసలు ఎన్నికలకు వెళ్లాలి..? ఏయే హామీ ఇవ్వాలి..? రెండోసారి సీఎం సీటును ఎవర్ని వరించబోతోంది..? ఏయే కొత్తపథకాలతో మనం మళ్లీ నెగ్గొచ్చని.. అసలు మన మైనస్ పాయింట్స్‌‌ ఏవి..? అనే విషయాలపై నిశితంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. జనవరి 31న జరిగిన కేబినెట్ మీటింగ్‌‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

భూధార్ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించే బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

రాజధాని అభివృద్ధికి రూ.55,343 కోట్లతో సమగ్ర ఆర్ధిక ప్రణాళిక

అమరావతిలో 7 సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ కేబినెట్‌ ఆమోదం

గుంటూరులో టెక్స్‌టైల్ పార్క్‌కు భూములు కేటాయింపు

కర్నూలు ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసుకు స్థలం కేటాయింపు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయం

పసుపు-కుంకుమ పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర

అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపుపై కేబినెట్‌ కీలక నిర్ణయం

హైకోర్టులో రూ. 250 కోట్లు డిపాజిట్ చేసి అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాలని నిర్ణయం

ఆస్తుల వేలం తర్వాత కోర్టు నుంచి నగదు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం

ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న ప్రభుత్వం

చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం

ప్రత్యేకహోదా, వంశధార నిర్వాసితులపై కేసులు ఎత్తివేత

సమైక్యాంధ్ర ఉద్యమంలో కేసులు ఎత్తివేతకూ కేబినెట్‌ ఆమోదం

బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని కేబినెట్‌ నిర్ణయం

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ బిల్లును..

అడాప్ట్‌ చేసుకునేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

10 శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కాపులకు కేటాయించాలని నిర్ణయం

అసెంబ్లీలో బిల్లు పెట్టాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

మొత్తానికి చూస్తే త్వరలో ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవన్నీ ఎంత వరకు వర్కవుట్ అయితాయనే విషయాలు తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

అవార్డు తీసుకున్న తర్వాత ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ఎంపీ కవిత ‘ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ బెస్ట్ పార్లమెంటేరియన్’ అవార్డును అందుకున్నారు.

హంగ్ వచ్చే అవకాశం ఉంది.. వైఎస్ జగన్

2019 ఎన్నికల్లో కేంద్రంలో హంగ్‌ వచ్చే అవకాశం ఉందని వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జోస్యం చెప్పారు.

టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన లక్ష్మీ మంచు

ఇప్పటికే నేను సైతం లాంటి కార్యక్రమంతో ఆపన్నులని ఆదుకోడానికి ముందుకు వచ్చి తన పెద్ద మనసు చాటుకున్న నటి లక్ష్మీ మంచు.. మరో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

'ఇస్మార్ట్ శంకర్' సినిమా లో హీరోయిన్ గా నభ నటేష్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ' ఇస్మార్ట్ శంకర్'..

దిల్‌రాజు మళ్ళీ సిక్సర్ కొడతారా?

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు 2017లో సిక్సర్ కొట్టారు. 'శతమానం భవతి', 'నేను లోకల్', 'డీజే', 'ఫిదా', 'రాజా ది గ్రేట్',