రాజధాని మార్చే అధికారం మీకెక్కడిది!?: చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ కెబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలుగుప్పిస్తూ.. రాజధానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. నాని.. అస్తమాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ,.. దేశంలోనే అతిపెద్ద రాజకీయనేత.. ఇలా చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు,. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా మీట్ నిర్వహించి.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎప్పటికైనా అమరావతి ప్రజా రాజధాని అని.. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అనే చంద్రబాబు స్పష్టం చేశారు. అసలు సంపద ఎలా సృష్టించాలో అనేది వీళ్లకు (ప్రభుత్వానికి) తెలుసా? అని బాబు ప్రశ్నించారు.
అందుకే ల్యాండ్ పూలింగ్ చేశాం!
‘నా 40 ఏళ్ల అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు.. అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తే అది రాష్ట్రానికి ఆదాయ మార్గం అవుతుంది. 65శాతం తెలంగాణ ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోంది. ముంబై, బెంగళూరు, చెన్నై ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వనరులుగా తయారయ్యాయి. రాజధానిపై ప్రభుత్వం 7 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తోంది. 5 కోట్ల మంది ఆంధ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమరావతిలో 9 వేల కోట్లకుపైగా పనులు చేపట్టాం. డబ్బులు లేకుండా రాజధానిని కట్టాలన్న ఆలోచనలో భాగమే ల్యాండ్ పూలింగ్ చేపట్టాం. రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీ ఇచ్చాం.. రాజధానిలో భూమిలేని వారికి రూ.2500 పెన్షన్ కూడా ఇచ్చాం. ఈ విధానాన్ని ప్రపంచం మొత్తం అధ్యయనం చేసే పరిస్థితి కల్పించాం’ అని ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు కౌంటర్ల వర్షం కురిపించారు.
మీకు ఆ హక్కు ఎవరిచ్చారు!?
‘రాజధానిని మార్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?. భారతదేశ చరిత్రలో రాష్ట్ర రాజధానిని మార్చిన ఘటనలు ఎప్పుడైనా జరిగాయా?. అడ్మినిస్ట్రేషన్‌ను వికేంద్రీకరించి ‘అభివృద్ధి’ అంటే అయిపోదు. జగన్ ఏడు నెలల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. విశాఖపై అంతప్రేమ ఉంటే అక్కడ డేటా సెంటర్ రాకుండా వైసీపీ నేతలు ఎందుకు అడ్డుపడ్డారు. అదే కనుక ఆ సెంటర్ ఇక్కడ ఏర్పాటై ఉంటే నాలుగైదేళ్లలో హైదరాబాద్ స్థాయికి వెళ్లేది. ఫార్చూన్ 500 కంపెనీలకు కేంద్రంగా విశాఖను తయారు చేయాలని నా హయాంలో భావించి ముందుకెళ్లాం. ఇలాంటివి జరిగితే అభివృద్ధి జరిగింది. రాజధాని అమరావతి ప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశమే లేదని గ్రీన్ టైబ్యునల్ గతంలోనే పేర్కొంది. ఇక్కడ నిర్మాణాలకు పునాదులు వేసేందుకు అయ్యే ఖర్చులు చెన్నై, హైదరాబాద్‌లతో పోల్చుకుంటే అమరావతిలోనే తక్కువ అవుతుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com