Chandra Babu:చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపసై విచారణను రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ తరపును సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. సీఐడీ కస్టడీ పిటిషన్ తరపును అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఏఏజీ పొన్నవోలు వాదిస్తున్న సమయంలో న్యాయమూర్తి పలు కీలక సందేహాలను లేవనెత్తారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపిస్తూ రిమాండ్ రిపోర్టునే ఆయన మళ్లీ చదివి వినిపించారు. ఈ సమయంలో న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. పదే పదే అవే వాదనలు వినిపిస్తూ సమయం ఎందుకు వృధా చేస్తారని ప్రశ్నించారు. అలాగే ఈ కేసులో ఏ 37కి డబ్బు ముట్టినట్లుగా ఆధారాలు ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
జైలులో ఉన్న వ్యక్తి సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారు.. న్యాయమూర్తి ప్రశ్న
అయితే చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని అనే వ్యక్తులు విదేశాలకు పారిపోయారని.. వారితో చంద్రబాబుకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉండగానే సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ ఇస్తే ఇంకా ప్రభావితం చేస్తారని ఆయన వాదించారు. అయితే జైల్లో ఉన్న వ్యక్తి సాక్షుల్ని ఎలా ప్రబావితం చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం ఏదైనా ప్రభుత్వ స్కీంలో స్కాం జరిగిదే.. ఆ శాఖ ఉన్నతాధికారిని బాధ్యుడ్ని చేస్తారా..? ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేస్తారా..? అని న్యాయమూర్తి ఏఏజీని అడిగారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను రేపు ఉదయానికి వాయిదా వేశారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు..
అంతకుముందు ఇవాళ ఉదయం విచారణ ప్రారంభం కాగానే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు తప్పిదం ఏమీ లేదని చంద్రబాబు తరఫున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. అప్పటి ఆర్థిశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి స్కిల్ డెవలప్మెంట్పై అధ్యయనం చేశారు అని దూబే వాదించారు. సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంంతరం తెలపలేదని.. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయన్నారు. అలాగే కాస్ట్ ఎవాల్యూషన్ కమిటీలో చంద్రబాబు లేరని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని వాదించారు. సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగించిందని వాదించారు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ఇప్పటికే రెండు రోజులపాటు సీఐడీ కస్టడీ తీసుకుని విచారణ చేపట్టిందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout