చంద్రబాబుకే అర్థంకాక తలపట్టుకున్నారట..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ విజయ దుందుభి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీకి మాత్రం గత ఎన్నికల ఫలితాల అనంతరం ఎంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను అయితే పార్టీలోకి చేర్చుకున్నారో అదే నంబర్ మిగిలింది. అయితే ఆ షాక్ నుంచి ఇంకా తెలుగు తమ్ముళ్లు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇంకా తేరుకోలేకపోతున్నారు. అంతేకాదు.. అసలు ఎక్కడ లోపం జరిగింది..? తప్పులు ఎక్కడ దొర్లాయి..? అనేది ఇప్పటికీ అర్థం కాక తలలు పట్టుకున్నారట బాబు. ఈ విషయం స్వయాన చంద్రబాబు టీడీపీ వర్క్ షాప్‌లో చెప్పడం గమనార్హం.
37 ఏళ్ల టీడీపీ చరిత్రలో ...
శుక్రవారం నాడు గుంటూరు జిల్లాలో టీడీపీ వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికల్లో ఓటమికి కారణాలు కనిపించేవి కానీ ఈ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఓటమికి కారణాలు కూడా కనిపించని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సమావేశానికి వచ్చిన నేతలకు ఆలోచనలో పడ్డారట. 37 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఐదుసార్లు గెలిచి.. నాలుగుసార్లు ఓడామని గెలిచినప్పుడు ఆనందం ఉంటుందని.. అలాగే ఓడిపోయినప్పుడు ఆవేదన ఉండటం సహజమని బాబు వ్యాఖ్యానించారు.
కారణాలేంటో కనుక్కోండి!
"రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధి, సంక్షేమంలో ఏ లోటు లేకుండా చేశాము. అయినా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే విషయంపై నేతలు క్షేత్రస్థాయి నుంచి సమీక్షలు చేసుకోవాలి. ఎన్నికల్లో ఓటమి చెందినా... ఈ సారి పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటమికి కారణాలు అన్వేషించడంతో పాటు ఒక్కో నియోజకర్గంలో ఓటమికి గల కారణాలను తెలుసుకోవాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. మూడు వారాల్లోనే వందకు పైగా దాడులు జరిగాయి. పార్టీ నేతలంతా కార్యకర్తలకు అండగా ఉంటూ వారికి ధైర్యం చెప్పాలి. దాడులు ఎక్కడ జరిగినా తక్షణమే స్థానిక నాయకత్వం స్పందించాలి. ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వాలి" అని నేతలకు చంద్రబాబు సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com