Chandrababu:పేదలపై మరోసారి చంద్రబాబు కుట్రలు.. పథకాలు అందకుండా ఈసీకి ఫిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబుకు పేదలంటే ఎందుకింత చులకనే అర్థం కావడం లేదు. తొలి నుంచి పేదలంటే ఆసహ్యించుకునే చంద్రబాబు ఎన్నికల వేళ పేదలపై మరింత పగపట్టాడు. వారికి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇవ్వుకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్నటి మొన్న వృద్దులకు పెన్షన్లు అందకుండా చేసిన చంద్రబాబు.. ఇపుడు జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పేదలకు చేరకుండా అడ్డుకుంటున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్స్ మెంట్, విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలను పేదలకు చేరకుండా ఈసీకి ఫిర్యాదులు చేసి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. దీంతో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వడానికి ఈసీ మోకాలడ్డింది. మరోపక్క ఖరీఫ్‌కు సన్నద్దమవుతున్న రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోయింది. అలాగే విద్యార్ధులకు ఇచ్చే ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు నిలిచిపోయాయి. చంద్రబాబు బ్యాచ్ ఫిర్యాదులతో పేదలకు అందాల్సిన నిధులు ఆగిపోయాయి. అందుకే పేదల వ్యతిరేకి అయిన చంద్రబాబును తరిమేసే రోజులు అసన్నమవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. వారం రోజుల్లో జరిగే పోలింగ్‌లో తమ ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఒక్క నెల రోజులు ఓపిక పడితే మళ్ళీ జగన్ పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు ఇదే అంశంపై సీఎం జగన్ కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. మచిలీపట్నం వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతోందని అనుమానం వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని వాపోయారు. ఇష్టానుసారం అధికారులను మార్చేస్తున్నారని.. ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను పేదల నుంచి దూరం చేసేందుకు అందరూ కలిసి ఇన్ని కుట్రలు చేస్తున్నారని తెలిపారు. మీకు మంచి జరగాలంటే మే 13న జరిగే పోలింగ్‌లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డను ఆశీర్వించాలని అభ్యర్థించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com