‘జగన్‌కు ఓటేశారు.. ఇప్పుడు నేను పోరాటం చేయాలా!?’
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు.! అయితే ఆ రెండూ కనిపించకుండా బయటికి మాత్రం నవ్వుతూనే మాట్లాడారు. న్యూ ఇయర్ రోజున రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెంలో ఆందోళన చేపడుతున్న రైతులకు చంద్రబాబు మద్దతిచ్చారు. మరోవైపు బాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని వాసులపై ఒకింత షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నన్ను మీరే ఓడించారు. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజావేదికను కూల్చినప్పుడు.. అంతా మనకెందుకు అనుకున్నారు. నా ఇల్లును ముంచే ప్రయత్నం చేస్తే చంద్రబాబు సొంత గొడవ అనుకున్నారు. ఇప్పుడు రాజధాని విషయం వచ్చేసరికి ఇక్కడి ప్రజలందరిలో ఆందోళన మొదలైంది. నేను వద్దు... వద్దు అన్నా... జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. నేను ఎన్నికల సమయంలో జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం నాశనం అవుతుందని మొత్తుకున్నా ఎవరూ వినలేదు. కరెంట్ తీగను పట్టుకోవద్దని చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం నన్ను పోరాటం చేయాలని అడుగుతున్నారు’ అని రాజధాని రైతుల గురించి చంద్రబాబు మాట్లాడారు.
అప్పుడు ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులు!
‘జగన్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ముద్దులు పెట్టాడు.. ఇప్పుడు మాత్రం తన నిర్ణయాలతో పిడిగుద్దులు గుద్దుతున్నాడు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డిని నేను విమర్శిస్తే ఆయన పట్టించుకునేవారు.. నన్ను చూస్తే ఆయన గౌరవించేవారు. కానీ.. జగన్ మాత్రం అలా చేయడం లేదు. సూచనలను పట్టించుకోవట్లేదు. రాజధాని అనేది కొంతమంది కోసం కాదు.. రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ప్రజలది. రాష్ట్రంలో ఉండే రైతులంతా ముందుకు రావాలి.. రాజధాని కోసం పోరాటాలు చేయాలి. ఆంధ్రుల కల అమరావతి. ఇక్కడే రాజధాని ఉండాలి’ అని బాబు చెప్పుకొచ్చారు.
పవన్‌ను అడ్డుకున్నారు!
‘అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం తెలపడానికి నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తే ఆయన్ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. రహదారిపై ముళ్లను అడ్డుగా పెట్టి అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళ్లారు. ఆయన్న ప్రజలే కాపాడుకుంటూ తీసుకెళ్లారు. వైసీపీ చర్యలు సరికాదు. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు మేం కూడా ఇలాగే ముళ్ల కంచెలు అడ్డుపెడితే ఎలా యాత్రను ఎలా కొనసాగించేవారు?. రైతుల కష్టాలు వింటుంటే బాధేస్తోంది’ అని బాబు భావోద్వేగానికి లోనయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout