Chandrababu:ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన కేసులు కోర్టుల్లో వాయిదా పడుతూనే వస్తున్నాయి. తాజాగా ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. స్కిల్ కేసు తీర్పు తర్వాత ఫైబర్ నెట్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అప్పటివరకు పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగిస్తూ చంద్రబాబును అరెస్టు చేయొద్దని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం సీఐడీ లాయర్లను ఆదేశించింది.
స్కిల్ కేసులో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం సుదీర్ఘ విచారణ చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని నేటికి వాయిదా వేసింది. మరోవైపు రేపటి నుంచి దసరా సెలవులు కావడంతో తీర్పు ఇవాళ వస్తుందా? లేక సెలవుల అనంతరం వస్తుందా? అని చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. తీర్పు వస్తే తమకు అనుకూలంగా వస్తుందో? రాదో? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
లీగల్ ములాఖత్‌ల పెంపు పిటిషన్ తిరస్కరణ..
మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల పెంపు పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు. ప్రతివాదులను చేర్చాలని న్యాయమూర్తి సూచించగా.. చేరుస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించిన సంగతి తెలిసిందే. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. దీనిపై టీడీపీ తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments