టీడీపీ కమిటీలను ప్రకటించిన చంద్రబాబు.. ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్న..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ కమిటీలను ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ప్రకటించిన చంద్రబాబు.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణనే కొనసాగిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలైన నందమూరి హరికృష్ణ తనయురాలు నందమూరి సుహాసినిని తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. కాగా.. 27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేయగా.. 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావును చంద్రబాబు నియమించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు.
పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి కాల్వ శ్రీనివాసులు, బాలకృష్ణ, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్‌కుమార్‌గౌడ్‌ను నియమించారు.

కాగా.. పొలిట్ బ్యూరోలో నారా లోకేష్, వర్ల రామయ్య, అచ్చెన్న, ఎల్.రమణ కూడా సభ్యులుగా ఉన్నారు. కాగా.. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులుగా దీపక్‌రెడ్డి, పట్టాభిరామ్, నసీర్, ప్రేమ్‌ కుమార్, జోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, అశోక్‌ బాబులను నియమించారు. క్రమశిక్షణ కమిటి చైర్మన్ బచ్చుల అర్జునుడు, క్రమశిక్షణ కమిటి సభ్యులుగా మునిరత్నం, జి.నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, కోశాధికారిగా శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, పొలిటికల్ సెక్రటరీగా జనార్ధన్‌లను చంద్రబాబు నియమించారు.

More News

డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలిగిపోయింది.

సీఎం కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. ఐదేళ్ల క్రితం పిన తల్లి చేతుల్లో తీవ్ర వేధింపులకు గురై..

ప్రేక్షకులు ఒకటి తలిస్తే.. బిగ్‌బాస్ మరొకటి తలిచాడు

మంచి జోష్ ఉన్న సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వెంటనే సండే ఫన్‌డే స్టార్ట్ చేశారు. నోయెల్ సంచాలక్‌గా డాట్స్ గేమ్‌ను నాగ్ స్టార్ట్ చేశారు.

దేశంలో ముమ్మర దశను దాటిన కరోనా.. అంతం అప్పుడే..

భారత్‌లో కరోనా అంతం ఎప్పుడు? అసలు ఇప్పుడు అది ఏ స్థితిలో ఉంది అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటి సమాధానాలిచ్చింది.

ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత శ్రీనివాసన్‌‌కు తృటిలో తప్పిన ప్రమాదం

తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత శ్రీనివాసన్‌తో పాటు ఆయన కుటుంబానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది.