ఈసీ పై సీఎం గరం గరం
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన ఈసీ ని తానెప్పుడూ చూడలేదని...వివి ప్యాట్ లా లెక్కింపు పై సుప్రీంకోర్టు లో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా ప్రశ్నిస్తాను అని...ఇందుకోసం రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
బ్యాలెట్ ఓటింగ్ జరిగినప్పుడు ఎంత సమయం పట్టేదో ఆలోచించాలి అని... వివిప్యాట్ల లెక్కింపు కు ఆరు రోజులు పడుతుందని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు. వివి ప్యాట్ల లెక్కింపు కు ఆరు గంటలు సరిపోద్ది అని చెప్పుకొచ్చారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన బాబు.... ఈవిఎం లు మొరాయిస్తే వాటిని సరి చేసిన నిపుణులు ఎవరు..? వారికి ఉన్న అర్హతలు ఏంటో.. ఈసీ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈవీఎం ల టాంపరింగ్ విషయంలో జాతీయస్థాయిలో పోరాడుతానని స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధి భవిష్యత్... ఒక యంత్రం పై ఆధారపడడం శోచనీయం అన్నారు. ఏకధాటిగా ఈవీఎం లు రెండు గంటలు పని చేయకపోతే రిపోలింగ్ కు అవకాశం ఉందని వివరించారు చంద్రబాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout