మళ్లీ తెరపైకి ఓటుకు నోటు.. బాబు, రేవంత్ పరిస్థితేంటి!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు దగ్గరపడుతున్న టైమ్‌లో మరోసారి ఓటుకు నోటు కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో కేసులో నిందితులుగా ఉన్న వాళ్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిగా స్తబ్దుగా ఉన్న కేసు ఎందుకు సరిగ్గా ఈ టైమ్‌లో ఎందుకు వెలుగులోకి వచ్చింది..? అనేది అంతుచిక్కని విషయం. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని విచారణ కోసం ఈడీ ముందుకు రావాలని నోటీసులివ్వడం జరిగింది. మరోవైపు రేవంత్.. అప్పటి టీడీపీ నాయకులు సెబాస్టియన్, ఉదయ్‌సింహాలకు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. కాగా ఈ వేం నరేందర్ రెడ్డి గెలుపుకోసమే గతంలో నామినెటేడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్‌గా కోట్ల డబ్బులు ఎరగావేసి లాక్కోవాలని చూసి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అండ్ కో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే.
అప్పుడెప్పుడో జరిగిన ఈ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి రావడానికి కారణం ఎలక్షన్ స్టంట్ మాత్రమేనని అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబే ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. ’ అంటూ స్టీపెన్‌సన్ తో మాట్లాడినట్లు ఆడియో టెపులు అప్పట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణ సాధారణ ఎన్నికలు అయిపోవడం.. మళ్లీ త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ కేసు వ్యవహారాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే దగ్గరుండి మళ్లీ తెరపైకి తెచ్చిందనే ఆరోపణలు చాలానే ఉన్నాయి.
చంద్రబాబు, రేవంత్ పరిస్థితేంటి.!?
ఏపీలో ఎన్నికల టైమ్ ఆసన్నం కావడంతో రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇప్పటికే ఇలా చేస్తున్నారని టాక్. అయితే ఇదేగానీ గట్టిగానే జనాల్లోకి వెళితే చంద్రబాబుకు ఒక మైనస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి పరిస్థితి చూస్తే.. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అంతేకాదు ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏంటో చూపించారు రేవంత్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలకు చట్టసభలకు వెళ్లాలని తహతహ లాడుతున్నారు. అయితే మధ్యలోనే ఇలాంటి షాకింగ్ ఘటనలు జరగడం గమనార్హం.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్‌ను ఈడీ, పోలీసులు ఏం చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి చుట్టూ కొత్త ఉచ్చు బిగిస్తోందా? రేవంత్‌కు మళ్లీ కష్టాలు మెదులుతున్నాయా..? రేవంత్‌ను మళ్లీ అరెస్ట్ చేయడానికి టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోందా..? ప్రత్యర్థుల్లో ఎవరెవర్ని ఎక్కడ్నుంచి అరెస్ట్ చేయబోతున్నారు.? మొత్తం వ్యవహారంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయ్..?అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com