హుందాతనం మరిచిన చంద్రబాబు అండ్ సన్!

  • IndiaGlitz, [Thursday,February 21 2019]

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మాటలు తూటాలు పేలుతున్నాయ్. ఆ తూటాలు కాస్త రివర్స్ అవుతుండటంతో నేతలు నోరు జారుతున్నారు. అసలు తామేం మాట్లాడుతున్నామా అనే విషయం ఎరుగక అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తున్నారు. అటు అధికార పార్టీ నేతలు.. ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకునే క్రమంలో.. ఆ మాటలు కాస్త వ్యక్తిగతమై ఎక్కడికెక్కడికో వెళ్లిపోతున్నాయ్. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అండ్ సన్ నారా లోకేశ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఏపీలో రాజకీయ పరిణామాలను శరవేగంగా మారిపోతున్నాయి. దీంతో అధికార పార్టీ అస్త్ర శస్త్రాలకు పదునుపెడుతుండగా.. వైసీపీ వాటిని చిత్తు చేస్తూ ముందుకెళ్తోంది. మరోవైపు జనసేన మీరిద్దరూ కొట్టుకోండి మూడో వ్యక్తి అయిన నేను లబ్ధి పొందుతానని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి జరిగిన జంపింగ్‌‌లు, జగన్‌‌తో పలువురు ప్రముఖల భేటీలపై చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. అయితే ఇక్కడే సీఎం అనే హుందాతనం మరిచారు.!. ఇటీవల ఏటీవల ఏలూరులో బీసీ గర్జన‌లో జగన్‌‌ వ్యాఖ్యలపై ఫ్రస్టేషన్‌‌తో మాట్లాడుతున్నారని బాబు వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళితే ఎవరికి ఫ్రస్టేషన్‌‌ ఉంటుందనే విషయం అనేది ఎవరికుంటుంది..? మరోవైపు నేరస్థుడితో టాలీవుడ్ నటులు భేటీ అవుతున్నారని బాబు అంటున్నారు.. కోర్టులో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి నేరస్థుడు ఎలా అవుతారు..? కోర్టులు తీర్పు ఇవ్వకమునుపే మీరెలా ఇచ్చేస్తారు? అని సోషల్ మీడియా వేదికగా సీఎంపై సీఎంలు (కామెన్ మ్యాన్స్) తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్తుంటే మొత్తం గులాబీ బాస్, సీఎం కేసీఆరే చేస్తున్నారని.. ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తులు, వ్యాపారాలు హైదరాబాద్‌లో ఉండటంతో వారిని బెదిరిస్తు్న్నారని అనడం వెనుక ఆంతర్యమేంటో ఆయనకే ఎరుక. అయితే ఆయన ఆస్తులు మాత్రం హైదరబాద్‌‌లో లేవేమో..!. పార్టీనుంచి వెళ్తున్న వారిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సిందిపోయి.. ఫ్రస్టేషన్‌‌తో బాబే ఇలా మాట్లాడుతున్నారు? అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పుల్వామా ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేయడం.. ఆమె ఆరోపణలు కొట్టి పారేయలేమని.. ప్రధాని మోదీ మోదీ ఏమైనా చేయగలరు? అని చంద్రబాబు ఆరోపించడంతో.. దేశం మొత్తం ఉగ్రదాడితో ఆవేదనలో ఉన్న ఈ సమయంలో ఇలా స్పందించడం ఎంత వరకు సబబు అని సోషల్ మీడియాలో నెటిజన్లు, విమర్శకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

నారా లోకేశ్ విషయానికొస్తే...

మంత్రి నారా లోకేశ్ ఈ మధ్య పూర్తిగా మారిపోయారు. ఒకప్పుడులాగా కాదు.. ఆయన స్పీచ్ .. ట్విట్టర్‌‌లో పోస్ట్‌లు పెట్టడాన్ని బట్టి చూస్తే లోకేశ్-2.0 అయిపోయారని అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీనేతకు సంబంధించిన ట్వీట్స్ చేసే విషయంలో మాత్రం మరీ ఓవర్‌‌గా 420, దొంగ, నేరస్థుడు, కరుడుగట్టిన నేరస్థుడు ఇలా పెద్ద పెద్ద పదాలే వాడుతున్నారు. ఇలా మాట్లాడటం వల్ల మీ హుందాతనం అవుతుందా..? మీకు మీరుగా పరువు తీసుకున్నట్లు అవుతుందా..? అంటూ టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.

చూశారు కదా.. చంద్రబాబు అండ్ సన్ మాటల తీరు.. ఎన్నికల సీజన్‌‌ కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా సార్. కాస్త ఆలోచించి ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చి.. వారితో మనం కూడా కాస్త గౌరవం పుచ్చుకుంటే మంచిదని విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. దీంతో ఇకనైనా మారుతారో లేకుంటే మరింత స్పీడ్ పెంచి రెచ్చిపోతారాో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

లండన్‌‌ వెళ్లిన జగన్‌‌కు కొన్ని గంటల్లోనే షాక్!?

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కుమార్తె వర్షా రెడ్డితో హాయిగా గడుపుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌‌

ప్రియురాలి కోసం ప్రొడ్యూస‌ర్‌గా...

కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార సినిమాల‌కు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది.. లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో న‌య‌న సినిమాలు 50 కోట్ల క్ల‌బ్‌లో కూడా చేరాయి. ఇప్పుడు ఈమె

ర‌వితేజ కాద‌ట‌.. నితిన్ 

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన చిత్రాల్లో 'ఎఫ్ 2' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ఎఫ్ 3' రూపొందుతుంద‌ని చెప్పారు.

జనసేన నుంచి పోటీచేసే అభ్యర్థులకు డెడ్‌‌లైన్

2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసే అభ్యర్థులకు అధిష్టానం డెడ్‌లైన్ విధించింది. ఆశావహుల నుంచి వస్తున్న బయోడేటాల స్వీకరణకు తుది గడువుగా ఈ నెల 25వ తేదీని

అభిమానులతో మాట్లాడి పార్టీ మారుతా: చింతమనేని

దెందలూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల యావత్ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, విద్యా్ర్థి విభాగాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.