చంద్రబాబు 4 సర్వేల్లో గెలుపెవరిదో తేలిపోయింది...
Send us your feedback to audioarticles@vaarta.com
అవును.. మీరు వింటున్నది నిజమే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఏపీ ఎన్నికల ఫలితాలపై నాలుగు సర్వేలు చేయించారు. అయితే ఈ నాలుగు సర్వేల్లోనూ టీడీపీనే ఘన విజయం సాధించబోతోందని తేలిపోయింది. ఈ విషయాన్ని స్వయానా చంద్రబాబు నాయుడే చెప్పుకొచ్చారు. అయితే ఇంత వరకూ పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు చేయించిన సర్వేల్లో మాత్రం టీడీపీకి గెలిచే ప్రసక్తే లేదని.. వైసీపీ ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు చేయించిన నాలుగు సర్వేల్లో తేలడం గమనార్హం. అయితే ఇన్ని రోజులు రిలీజైన సర్వేల్లో టీడీపీ ఓడిపోతుందని మదనపడిన తెలుగు తమ్ముళ్లు తాజా.. చంద్రబాబు సర్వేతో తెలుగు తమ్ముళ్లు ఆనందంలో మునిగితేలుతున్నారు.
సర్వేలో తేలిపోయింది...!
సోమవారం ఉదయం నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ సభ్యులు, ఏజెంట్లు, జిల్లాకు చెందిన కీలకనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సలహాలు, సూచనలు చేశారు. ఇప్పటికి 6పార్లమెంట్ స్థానాల సమీక్ష పూర్తి చేశామని.. ఈ రోజు మరో 2 పార్లమెంటరీ స్థానాల సమీక్ష చేశామన్నారు. "ఎన్నికల్లో పోటి చేయడం ఒక్కటే ముఖ్యం కాదు. రాష్ట్ర, దేశ రాజకీయాలను అధ్యయనం చేయాలి. 4 రకాల సర్వేలు చేయించాం. అన్ని సర్వేలలో టీడీపీ గెలుపు ఖాయంగా వచ్చింది. మనం చేసిన కార్యక్రమాలే మనకు శ్రీరామ రక్ష. ప్రకృతి మనకు బాగా కలిసివచ్చింది. లబ్దిదారులకు చేయాల్సినంత సంక్షేమం చేశాం. ఈ ఎన్నికలు మే నెలలో రావాల్సివుంది. కానీ.. తొలిదశలో ఎన్నిక పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. స్వల్ప గడువుతో టీడీపీని దెబ్బతీయాలని అనుకున్నారు. కానీ అదే తెలుగుదేశం పార్టీకి బాగా కలిసొచ్చింది. చెడు చేయాలని అనుకున్నా టీడీపీకి అంతా మంచే జరిగింది. ప్రతి నెలా తొలివారంలో లబ్దిదారులకు పించన్లు, ఆర్ధిక సాయం పడతాయి. రెండవ వారంలో ఏపి ఎన్నిక రావడం టీడీపీకి మేలైంది. మంచికి మారుపేరు తెలుగుదేశం.. దుర్మార్గాలకు మారుపేరు వైసీపీ, బీజేపీ. ఓడిపోతామని తెలిసి కూడా వైసిపి బుకాయిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇలాగే డ్రామా ఆడారు. మే 23న కౌంటింగ్‌లో టీడీపీ గెలుపు లాంఛనం మాత్రమే. ఏపిలో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం" అని చంద్రబాబు తేల్చిచెప్పారు. కాగా.. ఈ నాలుగు సర్వేలు ఎప్పుడు చేశారు..? ఎవరు చేశారు..? అనేది మాత్రం చంద్రబాబు వెల్లడించలేదు. అయితే ఈ సర్వేల వ్యవహారంపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
అందరూ చాలా గొప్పగా పనిచేశారు..
"సంస్థాగత బలమే ఈ ఎన్నికల్లో టీడీపీకి అక్కరకు వచ్చింది. 65లక్షల మంది కార్యకర్తలు, 4లక్షల మంది సేవామిత్రలు, 45వేల మంది బూత్ కన్వీనర్లు, 5వేల మంది ఏరియా కన్వీనర్లు ఉన్నారు. అందరూ తామే అభ్యర్ధులుగా భావించి కష్టపడి పనిచేశారు. ఈ దఫా ఎన్నికల్లో అన్నిస్థాయిల్లో అద్భుత పనితీరు. క్షేత్రస్థాయిలో అందరూ చాలా గొప్పగా పనిచేశారు. బూత్ కన్వీనర్లు,ఏరియా కన్వీనర్లు పార్టీకి అండగా నిలబడ్డారు. ఏ విధమైన ప్రలోభాలకు లోనుకాలేదు. నీతి-నిజాయితీలతో నిలబడ్డారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించాం.. అనేక రకాల విశ్లేషణలు చేయించాం. ఈసారి జరిగిన సర్వేలు విలక్షణంగా, విశ్లేషణలు వినూత్నంగా జరిగాయి. అన్ని సర్వేలు,విశ్లేషణల్లో టీడిపికే ఆధిక్యత వచ్చింది. 40ఏళ్లలో జరగని సంక్షేమం,అభివృద్ధి ఈ 5ఏళ్లలో చేశాం. ఒక్క మహిళలకే రూ.లక్ష కోట్ల సంక్షేమం చేశాం. బిసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటిలకు రూ.లక్ష కోట్ల సంక్షేమం ఇచ్చాం. రైతులకు రూ.24వేల కోట్ల రుణమాఫీ చేశాం. పెట్టుబడిసాయం కింద మరో రూ.14వేల కోట్లు ఇచ్చాం" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com